logo

ఈవీఎం @ 35ఏళ్లు..

దేశంలోని ఎన్నికల నిర్వహణలో ఈవీఎంలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. వీటిని పుట్టుపూర్వోత్తరాలను ఒకసారి తెలుసుకుదాం.

Published : 01 May 2024 09:05 IST

 1989లో తొలిసారి వినియోగం 

దేశంలోని ఎన్నికల నిర్వహణలో ఈవీఎంలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. వీటిని పుట్టుపూర్వోత్తరాలను ఒకసారి తెలుసుకుదాం. ఈవీఎం(ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌)ను తొలిసారి 1989లో వినియోగంలోకి తీసుకురాగా... ప్రయోగాత్మకంగా కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వీటిని వినియోగించారు. దిల్లీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోని 25 నియోజకవర్గాల్లో మాత్రమే ఈవీఎంలను ఉపయోగించారు. దీన్ని వల్ల సత్ఫలితాలు రావడంతో 2001లో పశ్చిమబెంగాల్‌, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలోనూ ఉపయోగించి ఎన్నికలు నిర్వహిచారు. 2004లో దేశవ్యాప్తంగా లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో వీటిని ఉపయోగించారు. అయితే వీటి వినియోగంపై పలు పార్టీలు అనుమానం వ్యక్తం చేయడంతో 2018నుంచి ఓటరు ఎవరికి ఓటు వేశారో చూసుకునేందుకు వీవీప్యాట్‌లను వీటికి అనుసంధానం చేశారు. పోటీ చేసిన అభ్యర్థులో ఎవరైనా నచ్చకపోతే 2013 నుంచి నోటాకు ఓటు వేసే విధాన్ని కేంద్రం ఎన్నికల సంఘం అమలు చేస్తుంది.

 న్యూస్‌టుడే, జైపూర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు