logo

దేవుడి పేరుతో భాజపా రాజకీయం

దేశాన్ని పదేళ్లు పాలించిన భాజపా చేసిన అభివృద్ధి ఏమీ లేకనే దేవుడి పేరుతో ఓట్లు అడుగుతోందని మంత్రి సీతక్క విమర్శించారు.

Published : 05 May 2024 02:51 IST

ఆదిలాబాద్‌ గ్రామీణం, న్యూస్‌టుడే : దేశాన్ని పదేళ్లు పాలించిన భాజపా చేసిన అభివృద్ధి ఏమీ లేకనే దేవుడి పేరుతో ఓట్లు అడుగుతోందని మంత్రి సీతక్క విమర్శించారు. శనివారం పట్టణంలోని బంగారుగూడ, ఆదిలాబాద్‌ గ్రామీణ మండలంలోని యాపల్‌గూడ, అంకోలి, పిప్పల్‌ధరి గ్రామాల్లో ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, నియోజకవర్గ ఇన్‌ఛార్జి కంది శ్రీనివాసరెడ్డితో కలిసి మంత్రి ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలోని హామీలను వివరిస్తూ భాజపా, భారాసపై విమర్శలు సంధించారు. భాజపా పేదలు ఉండేందుకు ఇళ్లు ఇచ్చిందా? సాగు చేసుకునేందుకు భూములిచ్చిందా? ఉద్యోగాలు ఇచ్చిందా? అని ప్రశ్నించారు. మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్‌ అప్పుల పాలు చేశారని విమర్శించారు. ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇచ్చి లోక్‌సభకు పంపిస్తే ప్రాంతీయ సమస్యలపై ప్రశ్నిస్తానన్నారు. నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న భాజపాకు ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు. సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు ముడుపు నళినిరెడ్డి, ఉయిక ఇందిర, కంది సాయిమౌనారెడ్డి, ఉయిక ఇందిర, చారి, అఫ్రోజ్‌ఖాన్‌ తదితరులున్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని