logo

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి

భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలుగు రాష్ట్రాల జమాతే ఉలేమా ప్రధాన కార్యదర్శి ...

Published : 09 May 2024 13:14 IST

ఎదులాపురం: భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలుగు రాష్ట్రాల జమాతే ఉలేమా ప్రధాన కార్యదర్శి హఫీజ్ పీర్ ఖలీఖ్ అహ్మద్ సాబీర్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్‌లోని మొహమ్మదియా మదర్సాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా  హాజరయ్యారు.  ఓటు ప్రాధాన్యత గురించి వివరించారు.  ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడే వారికి ఓటు వేయాలని  సూచించారు. ఓటు ప్రాధాన్యతపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని