logo

వేధింపులకు గురైతే ఫిర్యాదు చేయవచ్చు

మహిళలు, యువతులు వేధింపులకు గురైనా, మోసపోయినా వెంటనే ఫిర్యాదు చేస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని షీ టీం ఇన్‌ఛార్జి బి.సుశీల, సత్యమోహన్ సూచించారు.

Published : 09 May 2024 17:49 IST

ఎదులాపురం: మహిళలు, యువతులు వేధింపులకు గురైనా, మోసపోయినా వెంటనే ఫిర్యాదు చేస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని షీ టీం ఇన్‌ఛార్జి బి.సుశీల, సత్యమోహన్ సూచించారు. పట్టణంలోని జెన్ సాఫ్ట్ కంప్యూటర్ కేంద్రంలో శిక్షణ పొందుతున్న యువతులకు షీ టీం అందించే సేవలపై అవగాహన కల్పించారు. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, మార్ఫింగ్ చేసిన ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసినా 87126 59953 నెంబర్ కు ఫోన్ చేస్తే వెంటనే సాయం అందుతుందన్నారు. సైబర్ క్రైమ్‌కు గురైతే 1930 కు సమాచారం అందించాలన్నారు. ఎక్కడైనా మైనర్ అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసినట్లు తెలిస్తే 1098 లేదా 100 సమాచారం అందించాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని