logo

అనుమతి ఒకటి.. చేసేది మరొకటి!

రహదారి నిర్మాణం కోసం అవసరమైన మొరం కోసం అనుమతులు తీసుకుని యథేచ్ఛగా వెంచర్లకు లారీల్లో మొరం తరలిస్తున్న ఉదంతం ఇది.

Published : 10 May 2024 05:40 IST

మొరం తరలింపులో కళ్లముందే అక్రమాలు

రాజురా వెళ్లే మార్గంలో తవ్వకాలు

ఈనాడు, ఆసిఫాబాద్‌: రహదారి నిర్మాణం కోసం అవసరమైన మొరం కోసం అనుమతులు తీసుకుని యథేచ్ఛగా వెంచర్లకు లారీల్లో మొరం తరలిస్తున్న ఉదంతం ఇది. ఆసిఫాబాద్‌ పట్టణం నుంచి రాజురా వెళ్లే మార్గంలో కొంత కాలంగా పంట చేన్లలో జేసీబీ సహాయంతో లారీల్లో భారీ స్థాయిలో మట్టిని తీసుకు వెళ్తున్నారు. బూరుగూడ వద్ద ఉన్న వెంచర్లలో చదును చేయడానికి ఈ మొరాన్ని వినియోగిస్తున్నారు. రెబ్బెన మండలంలో నిర్మించే రహదారి కోసం ఈ మట్టిని వాడుతున్నామని మంచిర్యాలకు చెందిన వ్యక్తి గనులశాఖకు దరఖాస్తు చేసుకున్నారు. 2500 క్యూబిక్‌ మీటర్ల మేర మొరం తీసుకుంటున్నామని, అందుకు సంబంధించిన అనుమతులు సైతం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పనులకు సంబంధించి అవసరమైన అన్ని అనుమతులు గనులశాఖ అధికారులు ఇచ్చారు. సదరు గుత్తేదారు మాత్రం మట్టిని పూర్తిగా బూరుగూడ సమీపంలో నాలుగు వరుసల రహదారిని ఆనుకుని ఉన్న ఓ ప్రదేశంలో వేస్తున్నారు. నిత్యం మూడు లారీలు రాత్రీ పగలు తేడా లేకుండా నడుస్తున్నాయి.

  • ఈ విషయమై గనులశాఖ ఏడీ గంగాధర్‌ మాట్లాడుతూ.. రహదారికి అవసరమైన మొరం కోసమే అనుమతులు ఇచ్చామన్నారు. ఇతర ప్రదేశాలకు మట్టిని తరలించడానికి వీల్లేదని, తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని