logo

‘మన్యాన్ని గాలికి వదిలేసిన ప్రభుత్వం’

మన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని, వైకాపా పాలనలో ఇక్కడ అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి, తెదేపా అరకులోయ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌ ఆరోపించారు.

Published : 13 Aug 2022 01:48 IST


బొండాపుట్టు ర్యాలీలో శ్రావణ్‌కుమార్‌, తెదేపా నేతలు

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: మన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని, వైకాపా పాలనలో ఇక్కడ అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి, తెదేపా అరకులోయ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌ ఆరోపించారు. ముంచంగిపుట్టు మండలంలోని ఏనుగురాయి పంచాయతీ బొండాపుట్టు గ్రామంలో శుక్రవారం నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామానికి రహదారి, పాఠశాలకు భవన సదుపాయం కల్పించాలన్నారు. నిత్యావసర సరకుల ధరలు ఆకాశానికి అంటుతున్నాయని, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెంచి ప్రజలపై భారం మోపారని మండిపడ్డారు. జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీల  అమలులో వైకాపా ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తెదేపా నాయకులు, సర్పంచులు లక్ష్మణ్‌, పాండురంగస్వామి, అర్జున్‌, బుద్దు, మురళి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని