logo

తెదేపాలో చేరికలు

కూటమి అధికారంలోకి వస్తేనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. మొండిగెడ్డ, జర్రెల పంచాయతీల్లోని మొండికోట, కోటకొండ, మొండిగెడ్డ, జర్రెల గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 26 Apr 2024 01:59 IST

మొండికోటలో వైకాపా వార్డు సభ్యుడికి కండువా వేసి తెదేపాలోకి ఆహ్వానిస్తున్న కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: కూటమి అధికారంలోకి వస్తేనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. మొండిగెడ్డ, జర్రెల పంచాయతీల్లోని మొండికోట, కోటకొండ, మొండిగెడ్డ, జర్రెల గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గిరిజనులు, మహిళలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన వైకాపా.. గిరిజన ప్రాంత అభివృద్ధి మరిచి మైనింగ్‌పై దృష్టి సారించిందని విమర్శించారు. ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెదేపా ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం జర్ల పంచాయతీ వార్డు సభ్యుడు గసాడి రమణ (వైకాపా), వైకాపా నేత రీమల బుజ్జిబాబు తెదేపాలో చేరారు. తెదేపా మండల అధ్యక్షుడు ముక్కలి రమేష్‌, క్లస్టర్‌ ఇన్‌ఛార్జులు వడేలు పండ్రాజు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు తెల్లందొర, తెలుగు యువత మండల అధ్యక్షుడు ముర్ల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు