logo

భవనాలు పూర్తికావు..సేవలు అందవు

పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న వైకాపా ప్రభుత్వ లక్ష్యం ఆదిలోనే నీరుగారుతోంది. ముఖ్యంగా వివిధ కార్యాలయ భవనాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి.

Published : 26 Apr 2024 01:37 IST

వెలగపల్లి వద్ద నిలిచిపోయిన సచివాలయ భవనం

దేవీపట్నం, న్యూస్‌టుడే : పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న వైకాపా ప్రభుత్వ లక్ష్యం ఆదిలోనే నీరుగారుతోంది. ముఖ్యంగా వివిధ కార్యాలయ భవనాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. గుత్తేదారులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఇందుకు కారణంగా తెలుస్తోంది. నిర్మాణాలు పూర్తికాక స్థానికులకు అవసరమైన సేవలు అందడంలేదు.

 పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లోని దేవీపట్నం, మంటూరు, కొండమొదలు ఆర్‌అండ్‌ఆర్‌ పునరావాస కాలనీలో సచివాలయం భవనాలు నేటికీ ప్రారంభించలేదు. ప్రస్తుతం తాత్కాలికంగా కాలనీలో ఉన్న ప్రభుత్వ భవనాల్లోనే సచివాలయాలు ఏర్పాటుచేశారు. పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురైన దేవీపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వెలగపల్లి వద్ద నిర్మించడానికి ప్రభుత్వం అప్పట్లో పనులు ప్రారంభించింది. గుత్తేదారునికి సకాలంలో బిల్లులు రాకపోవడంతో ఆ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఆ తరువాత అంచనాలు పెరగడంతో గుత్తేదారు ముందుకు రాలేదు. దీంతో ప్రస్తుతం భవన నిర్మాణం చుట్టూ భారీగా తుప్పలు పెరిగిపోయాయి. ఈ పీహెచ్‌సీ నిర్మాణం పూర్తయితే యర్రమెట్ల నుంచి రాయవరం వరకు పలు గ్రామాల గిరిజనులకు వైద్యసేవలు అందుబాటులో ఉండేవి. ఇప్పటికైనా పీహెచ్‌సీ నిర్మాణం పూర్తి చేయాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు