logo

ఆర్థిక ప్రగతికి ఆరు పథకాలు

 తెదేపా ప్రవేశపెట్టనున్న సూపర్‌ సిక్స్‌ పథకాలు పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు పేర్కొన్నారు.

Published : 26 Apr 2024 01:34 IST

టేకుబాకలో ఇంటింటి ప్రచారం చేస్తున్న కూటమి నాయకులు

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: తెదేపా ప్రవేశపెట్టనున్న సూపర్‌ సిక్స్‌ పథకాలు పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు పేర్కొన్నారు. గురువారం చింతపల్లి ముత్యాలమ్మ ఆలయం వద్ద ప్రచార రథాలకు పూజలు నిర్వహించి, ప్రచారం ప్రారంభించారు. గిడ్డి ఈశ్వరిని గెలిపిస్తే అభివృద్ధిని మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపుతామని తెలిపారు. నాయకులు ఆనంద్‌, ముక్కల రమేష్‌, పండు, అబ్బాయ్‌నాయుడు, లక్ష్మణ్‌, రాము తదితరులు పాల్గొన్నారు.  

 కొయ్యూరు, న్యూస్‌టుడే:  అరకు పార్లమెంట్‌, పాడేరు అసెంబ్లీ అభ్యర్థులు కొత్తపల్లి గీత, గిడ్డి ఈశ్వరిలను గెలిపించాలని తెదేపా మండల ప్రధాన కార్యదర్శి టి.దొరబాబు కోరారు.  తెదేపా నేతలు ఎం.సత్తిబాబు, రాంబాబుతో కలిసి కొయ్యూరు కొండపై వెలసిన దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొయ్యూరు, మర్రివాడ పంచాయతీల్లో ప్రచారం నిర్వహించారు.

హుకుంపేట, న్యూస్‌టుడే: అరకు నియోజకవర్గంలో అభివృద్ధి సాధించాలంటే కూటమి బలపరిచిన నాయకుడిని గెలిపించాలని బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మత్స్యకొండబాబు పేర్కొన్నారు. మండల కేంద్రంలో తెదేపా, భాజపా, జనసేన నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. వైకాపా ప్రభుత్వంలో యువతకు, కార్మికులకు, నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. తెదేపా మండల అధ్యక్షుడు తులసీరావు, లక్ష్మణుడు, భాజపా నాయకులు గాసన్న కొండబాబు, సింహాచలం పాల్గొన్నారు.

కూనవరం, న్యూస్‌టుడే: రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే అవినీతిలో కూరుకుపోయిన వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని తెదేపా మండల అధ్యక్షుడు బరపాటి ప్రకాశరావు అన్నారు. తెదేపా, భాజపా, జనసేన నాయకులు టేకుబాకలో కూటమి అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మేనిఫెస్టోలోని అంశాలను ఓటర్లకు వివరించారు. నేతలు ఎడవల్లి భాస్కరరావు, పొడియం అప్పారావు, సుదర్శనరావు, పాయం వెంకయ్య, జనసేన నాయకులు పాల్గొన్నారు.

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో తెదేపా, భాజపా, జనసేన కూటమి గెలుపుతోనే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు సమకూరుతాయని తెదేపా డివిజన్‌ నాయకులు పాండురంగస్వామి అన్నారు. గురువారం ముంచంగిపుట్టు మండలంలోని ఏనుగురాయి, కిలగాడ, కొత్తూరు, గాదెలబురుగు, సజనకోట, కుమ్మరిపుట్టు, సుజనపేట, బీటా, పెదగుడ, గూడమాలిపుట్టు గ్రామాల్లో కూటమి నాయకులు ప్రచారం నిర్వహించారు. భాజపా మండల అధ్యక్షులు లక్ష్మణ్‌, తెదేపా ఉపాధ్యక్షులు బాబూజీ, భాజపా నేతలు రవికుమార్‌, వెంకటరమణ, మత్స్యరాజు పాల్గొన్నారు.

చింతపల్లి ముత్యాలమ్మ ఆలయం వద్ద నేతలు

చింతూరు: కూటమి అభ్యర్ధులను గెలిపించాలని మండలంలోని మల్లెతోట, ఉలుమూరులోపాటు పలు గ్రామాల్లో కూటమి నాయకులు గురువారం ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. అరకు పార్లమెంటు, రంపచోడవరం నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న కొత్తపల్లి గీత, మిరియాల శిరీషాదేవిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేశారు. నాయకులు ఇల్లా చిన్నారెడ్డి, డీవీఎస్‌ రవమణారెడ్డి, కట్టం ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎటపాక: పురుషోత్తపట్నంలో ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీషాదేవిలకు మద్దతుగా తెదేపా నేతలు పుట్టి రమేష్‌, మువ్వా శ్రీనివాస్‌, చేకూరి వెంకటరమేష్‌, విజ్జగిరి రవితేజ తదితరులు ప్రచారం నిర్వహించారు. తెదేపా సూపర్‌ సిక్స్‌ పథకాలు ప్రజలకు వివరించారు. తెదేపా, భాజపా నేతలు వల్లభనేని చందు, మోదుగు పెరమయ్య, బొల్లా ప్రసాద్‌, గోడేటి రవికుమార్‌, పేరాల వెంకన్న, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చలివేంద్రం ఏర్పాటు

ఎటపాక, న్యూస్‌టుడే: మండలంలోని త్రిపుర పెంటవీడు పంచాయతీ సీతాపురంలో తెదేపా యూనిట్‌ ఇన్‌ఛార్జి బాచినేని మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమ్మడి పార్టీల నాయకులు తెదేపా సీనియర్‌ నాయకులు కిలారు వెంకటేశ్వరరావు, అరకు పార్లమెంట్‌ కార్యదర్శి మువ్వా శ్రీనివాస్‌, తెదేపా మండల అధ్యక్షులు పుట్టి రమేష్‌బాబు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లభనేని చందు, జనసేన మండల అధ్యక్షులు మారాసు గంగాధర్‌, భాజపా మండల అధ్యక్షులు మోదుగు పెరమయ్య సమక్షంలో రిబ్బన్‌ కట్‌ చేశారు. భాజపా జిల్లా కార్యదర్శి ప్రసాద్‌, తెదేపా సీనియర్‌ నాయకులు వెంకన్న, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని