logo

ఇసుక తుపానును తలపించేలా.. దుమ్ము రేగి విలవిల

రాజవొమ్మంగిలో గురువారం 40 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదవడంతో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో చిరుజల్లులు పడ్డాయి.

Published : 26 Apr 2024 01:58 IST

రాజవొమ్మంగిలో జాతీయ రహదారిపై దుమ్ములో ప్రయాణికుల పాట్లు

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: రాజవొమ్మంగిలో గురువారం 40 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదవడంతో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో చిరుజల్లులు పడ్డాయి. జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతుండటంతో ఈ గాలులకు రహదారిపై ఉన్న దుమ్ము విపరీతంగా పైకి లేచింది. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం 3 వరకు వేడిగాలులతో, సాయంత్రం దుమ్ముతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు