logo

విద్యుదాఘాతంతో విలేజ్‌ హెల్పర్‌ మృతి

చూచుకొండ గ్రామ విద్యుత్తు హెల్పర్‌ పీతల శివ సూర్యనారాయణ (45) గురువారం విద్యుధాఘాతానికి గురై మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. చూచుకొండ-రామగిరి మధ్య విద్యుత్తు తీగ తెగిపడిందనే ఫిర్యాదు మేరకు హెల్పర్‌ శివ సూర్యనారాయణ ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద విద్యుత్తు సరఫరా నిలిపివేసి స్తంభంపై మరమ్మతులు చేశారు.

Published : 26 Apr 2024 01:43 IST

శివ సూర్య నారాయణ ( పాతచిత్రం)

మునగపాక, న్యూస్‌టుడే: చూచుకొండ గ్రామ విద్యుత్తు హెల్పర్‌ పీతల శివ సూర్యనారాయణ (45) గురువారం విద్యుధాఘాతానికి గురై మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. చూచుకొండ-రామగిరి మధ్య విద్యుత్తు తీగ తెగిపడిందనే ఫిర్యాదు మేరకు హెల్పర్‌ శివ సూర్యనారాయణ ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద విద్యుత్తు సరఫరా నిలిపివేసి స్తంభంపై మరమ్మతులు చేశారు. పనులు పూర్తిచేసి కిందకు దిగే సమయంలో విద్యుదాఘాతానికి గురై స్తంభం పైనుంచి కింద పడిపోయారు. ఈ ఘటనలో తలకు బలమైన గాయాలు కావడంతో చూచుకొండ పీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉద్యోగుల ఆందోళన

 కశింకోటలో ధర్నా చేస్తున్న ఉద్యోగులు

కశింకోట: శివ సూర్యనారాయణ మృతితో కశింకోట ప్రధాన కార్యాలయం వద్ద ఉద్యోగుల సంఘాల నాయకులు విధులను బహిష్కరించి ధర్నా చేశారు. ఈపీడీసీఎల్‌లో ఆర్‌ఈసీఎస్‌ విలీనమైనా ఇప్పటివరకు ఒప్పంద, రెగ్యులర్‌ ఉద్యోగులకు ఎటువంటి సౌకర్యాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తొమ్మిది మంది చనిపోయారని, ఉద్యోగ భద్రత కరవైందని, కారుణ్య నియామకాలు లేక కుటుంబాలు వీధిన పడ్డాయని, పీఎఫ్‌, ఈఎస్‌ఐ సదుపాయాలు లేవని, నష్టపరిహారం అందడం లేదన్నారు.   ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాంè్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు విధులను బహిష్కరించి పోరాటం చేస్తామని హెచ్చరించారు. రెగ్యులô్  ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్షులు ఎన్‌.గంగరాజు, కార్యదర్శి ఎం.పరదేశినాయుడు, ఉపాధ్యక్షులు డి.నూకరాజు, ఒప్పంద ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సిద్ధ గోవింద, గంగరాజు, వెంకట గోవింద, రమణ, చిన్నరాజు, జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు. బీ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఈఈ రామకృష్ణను కోరారు. ప్రమాద సమాచారం తెలుసుకొని కశింకోట ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న ఉద్యోగుల సంఘాల నాయకులను ఆయన కలిశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని