logo

‘ఉద్యమాలకు ఊతంగా నిలుస్తా’

ఎమ్మెల్సీగా తాను ఎన్నికైతే వివిధ సంఘాల ఉద్యమానికి ఊతంగా నిలుస్తానని పీడీఎఫ్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రమాప్రభ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రం పాడేరులో పర్యటించారు.

Published : 04 Oct 2022 02:38 IST


ప్రజా సంఘాల నాయకులతో మాట్లాడుతున్న పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి రమాప్రభ

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: ఎమ్మెల్సీగా తాను ఎన్నికైతే వివిధ సంఘాల ఉద్యమానికి ఊతంగా నిలుస్తానని పీడీఎఫ్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రమాప్రభ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రం పాడేరులో పర్యటించారు. పలు ప్రజా సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ విభజన హామీల్లో ఒకటైన గిరిజన వర్సిటీకి స్థలం కూడా కేటాయించకపోవడం దారుణమన్నారు. సీపీఎస్‌ రద్దు కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులను ప్రభుత్వం నిర్బంధిస్తోందన్నారు. రమాప్రభ గెలుపునకు అన్ని సంఘాల నాయకులు కృషి చేయాలని గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు అప్పలనర్సయ్య పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చిన్నయ్యపడాల్‌, యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేష్‌, జిల్లా సహాయ అధ్యక్షులు చీకటి నాగేశ్వరరావు, ధర్మారావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ప్రభుదాస్‌, ఆదివాసీ మాతృభాషా వాలంటీర్లు సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీను, జిల్లా అధ్యక్షులు సర్భునాయుడు, కార్యదర్శి కుమారి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని