logo

ఈ పాఠశాలకు నాడు-నేడు వర్తించదా?

గిరిజన విద్యాభివృద్ధికి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఎస్టీ విభాగం ఛైర్‌పర్సన్‌ శాంతకుమారి అన్నారు.

Updated : 01 Feb 2023 06:29 IST

శిథిల భవనం ముందు విద్యార్థులు, శాంతకుమారి నిరసన

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: గిరిజన విద్యాభివృద్ధికి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఎస్టీ విభాగం ఛైర్‌పర్సన్‌ శాంతకుమారి అన్నారు. మండలంలోని పోతంగి పంచాయతీ వంతార్డ గ్రామంలో పాఠశాలను ఆమె మంగళవారం సందర్శించారు. పూర్తిగా శిథిలావస్థకు చేరిన భవనాలో చిన్నారులు చదువు కొనసాగిస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు నాడు-నేడు వర్తించదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేతలు దయానిధి,  భీమారావు, వెంకట్‌బాబు, గాసినాయుడు, సీతారాం తదితరులు పాల్గొన్నారు.


అన్ని రంగాల్లో వెనుకబడిన ఆదీవాసీలు

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్న ఆదీవాసీలకు రిజర్వేషన్‌ దూరం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నామని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వంతల సుబ్బారావు అన్నారు. మంగళవారం స్థానిక కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, మన్యంలో వీరు నివాసముంటున్న గ్రామాలకు రహదారులు, తాగునీరు, విద్యుత్తు తదితర సదుపాయాలు లేవన్నారు. విద్య, వైద్యం పూర్తిస్థాయిలో అందలేదని, అభివృద్ధికి దూరంగా జీవిస్తున్నారన్నారు. వీరి కోసం ప్రత్యేక పథకాలు, కనీస మౌళిక సదుపాయాలు కల్పించి, కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ఆయన కోరారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గురుమూర్తి, శ్రీనివాస్‌, గోవిందు, చిన్నబ్బాయి, రామకృష్ణలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని