logo

ఈదురుగాలులకు నేలకూలిన వృక్షాలు

చింతపల్లిలో బుధవారం ఈదురుగాలులు, గాలివాన బీభత్సం సృష్టించాయి. ఉదయం దట్టంగా పొగమంచు కురిసింది. మధ్యాహ్నం వరకూ ఎండ కాసింది.

Published : 30 Mar 2023 03:10 IST

చింతపల్లిలో నేలకూలిన అరటి చెట్లు

చింతపల్లి/గ్రామీణం న్యూస్‌టుడే: చింతపల్లిలో బుధవారం ఈదురుగాలులు, గాలివాన బీభత్సం సృష్టించాయి. ఉదయం దట్టంగా పొగమంచు కురిసింది. మధ్యాహ్నం వరకూ ఎండ కాసింది. ఆ తర్వాత ఉన్నట్టుండి కారుమేఘాలు కమ్ముకున్నాయి. చిరుజల్లుతో వర్షం  మొదలైంది. భారీగా ఈదురుగాలులు వీచాయి. ఈదురుగాలుల తాకిడికి పలు చోట్ల  వృక్షాలు నేలకూలాయి. చింతపల్లిలోని బాలాజీపేట సమీపంలో అరటిచెట్లు నేలకూలాయి. యూనియన్‌ బ్యాంకు సమీపంలో రహదారిపై ఒక వృక్షం విద్యుత్తు స్తంభంపై పడింది. వారపు సంతలో సిల్వర్‌ చెట్టు వేళ్లతో సహా పడిపోయింది. అదనపు ఎస్సై వెంకటరమణ, ఏఎస్సై దాసులు సిబ్బందితో రహదారిపై పడిన చెట్టును గొడ్డళ్లతో తొలగించి వాహనాల రాకపోకలకు మార్గం సుగమం చేశారు. విద్యుత్తు సరఫరాకు ఆటంకం ఏర్పడింది.

చింతపల్లి వారపుసంతలో దుకాణాలపై పడిన భారీ వృక్షం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని