సివిల్స్ ప్రాథమిక పరీక్షకు 51.28 శాతం హాజరు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యు.పి.ఎస్.సి.) ఆధ్వర్యంలో సివిల్స్ ప్రాథమిక పరీక్ష ఆదివారం నగరంలోని 29 కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగింది.
పరీక్ష రాసి వస్తున్న అభ్యర్థులు
విశాఖపట్నం, న్యూస్‌టుడే: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యు.పి.ఎస్.సి.) ఆధ్వర్యంలో సివిల్స్ ప్రాథమిక పరీక్ష ఆదివారం నగరంలోని 29 కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగింది. ఉదయం జరిగిన పరీక్షకు 10,864 మందికిగాను 51.61 శాతం చొప్పున 5607, మధ్యాహ్నం పరీక్షకు 10,864 మందికి గాను 50.95 శాతం చొప్పున 5536 మంది హాజరయ్యారు. రెండు పూటలా జరిగిన పరీక్షలకు మొత్తం 51.28 శాతం మంది హాజరయ్యారు. పరిశీలకులుగా వచ్చిన సీనియర్ ఐఏఎస్ అధికారులు కాంతిలాల్ దండే, కాటమనేని భాస్కర్, జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున పరీక్షా కేంద్రాలను సందర్శించారు. కలెక్టరేట్ నుంచి ప్రశ్నపత్రాల తరలింపు ప్రక్రియను డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి పర్యవేక్షించారు. అనంతరం జవాబు పత్రాలను స్పీడు పోస్టులో దిల్లీకి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.