logo

సంకేతం.. అందక సంకటం!

పలు గ్రామాల్లో సెల్‌ సంకేతాలు లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పథకాలకు ఆన్‌లైన్‌ చేసుకునేందుకు సిగ్నల్స్‌ కోసం రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించి కొండలు, గుట్టలెక్కాల్సి వస్తోంది.

Published : 07 Jun 2023 02:12 IST

కొల్లాపుట్టులో సిగ్నల్స్‌ కోసం సచివాలయ సిబ్బంది, గిరిజనుల పాట్లు

పలు గ్రామాల్లో సెల్‌ సంకేతాలు లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పథకాలకు ఆన్‌లైన్‌ చేసుకునేందుకు సిగ్నల్స్‌ కోసం రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించి కొండలు, గుట్టలెక్కాల్సి వస్తోంది. డుంబ్రిగుడ మండలంలోని కొల్లాపుట్టు పంచాయతీలో గిరిజన మహిళలంతా వాలంటీరుతో కొండపైకి నడిచి వెళ్తే తప్ప ఆన్‌లైన్‌ పనులు పూర్తికావడం లేదు. చింతపల్లి మండలం బలపం పంచాయతీ కేంద్రంలోనూ దాదాపు ఇదే పరిస్థితి గతంలో కోరుకొండలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సిగ్నల్స్‌ వచ్చేవి. తాజాగా ఎయిర్‌టెల్‌ టవర్‌ నిర్మాణం కోసం రహదారి పక్కన గొయ్యిలు తవ్వేయడంతో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ కేబుల్‌ తీగలు తెగిపోయాయి. దీంతో స్థానికులు సిగ్నల్‌ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్‌టెల్‌ టవర్‌ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, సిగ్నల్స్‌ వచ్చేలా చర్యలు చేపట్టాలని సర్పంచి కొర్ర రమేష్‌నాయుడు, సచివాలయ కార్యదర్శి చిన్నంనాయుడు, గ్రామస్థులు కోరుతున్నారు.

చింతపల్లి గ్రామీణం, డుంబ్రిగుడ, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని