logo

కోడ్‌ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడ ప్రచారం చేసినా ముందుగా అనుమతి తీసుకోవాలని స్థానిక ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి మనోరమ కోరారు.

Updated : 29 Mar 2024 02:56 IST

ఎలమంచిలిలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతున్న ఈఆర్‌ఓ మనోరమ

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడ ప్రచారం చేసినా ముందుగా అనుమతి తీసుకోవాలని స్థానిక ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి మనోరమ కోరారు. ఎలమంచిలి తహసీల్దార్‌ కార్యాలయంలో గురువారం సాయంత్రం నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులతో ఎన్నికల నిర్వహణ, అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశం నిర్వహించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రచార వాహనాలకు అనుమతులు తీసుకోవాలని సూచించారు. పరిమితికి మించి వాహనాలను వినియోగించకూడదని పేర్కొన్నారు. దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, సభలు ఏర్పాటు చేయకూడదని ఆదేశించారు. ఎన్నికల నియమావళి గురించి ఎటువంటి సందేహాలున్నా తమ కార్యాలయాన్ని సంప్రదించి తెలుసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్తులపై ఎటువంటి ప్రచార పత్రాలు అంటించరాదని స్పష్టంచేశారు. ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాలు చేస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రత్యేక బృందాలు నిరంతర నిఘాతో తిరుగుతాయని చెప్పారు. నాలుగు మండలాల తహసీల్దార్‌లు, తెదేపా, జనసేన, వైకాపా, తదితర పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఆయా పార్టీల నాయకులు వారికి ఉన్న సందేహాలను ఈఆర్‌ఓను అడిగి నివృత్తి చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని