logo

భౌతిక దాడులు రాజ్యాంగ విరుద్ధం

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భారత రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తోందని రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్‌, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు.

Published : 03 May 2024 02:23 IST

పాడేరులో సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న వడ్డే శోభనాద్రీశ్వరరావు తదితరులు

పాడేరు, న్యూస్‌టుడే: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భారత రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తోందని రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్‌, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. గురువారం పాడేరులో పర్యటించిన ఆయన స్థానిక సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఆయనతోపాటు రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు కె.విజయరావు, మాజీ ఐఏఎస్‌ అధికారి శ్రీనివాస్‌, రంగారెడ్డి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి అజయ్‌శర్మ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగం, కార్మికులపై నిర్బంధాన్ని ప్రయోగిస్తూ, చట్టాలు, హక్కులను కార్పొరేట్లకు అనుకూలంగా మార్చి వేస్తోందని ఆరోపించారు. మహిళలు, దళితులు, గిరిజనులపై భౌతికంగా దాడులు జరుగుతున్నాయని, ఇవి రాజ్యాంగ విలువలను కాలరాసేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అరకు పార్లమెంట్‌ సీపీఎం అభ్యర్థి పి.అప్పలనర్సను, ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బోనంగి చిన్నయ్యపడాల్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని