logo

మహిళలకు ఆర్టీసీ ప్రయాణం ఉచితం

కూటమి గెలుపుతోనే గిరిజనులకు సంక్షేమ పథకాలు అందుతాయని అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పాంగి రాజారావు అన్నారు.

Published : 06 May 2024 01:51 IST

సుంకరమెట్ట వారపు సంతలో కూటమి అభ్యర్థి పాంగి రాజారావు, తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి దొన్నుదొర ప్రచారం

అరకులోయ, న్యూస్‌టుడే: కూటమి గెలుపుతోనే గిరిజనులకు సంక్షేమ పథకాలు అందుతాయని అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పాంగి రాజారావు అన్నారు. సుంకరమెట్ట వారపు సంతలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు సంక్షేమ పథకాలు కోత లేకుండా అందాలంటే కూటమికి ఓటు వేయాలని అభ్యర్థించారు. తాము అధికారంలోకి వస్తే జీవో నంబర్‌ 3 పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు నెలకు రూ. 4 వేలు పింఛన్‌ అందిస్తామని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్‌ సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. ఆడబిడ్డలకు నెలకు రూ. 1500 చొప్పున అందిస్తామన్నారు. ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు. వైకాపా ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలతో పేదలంతా విసిగి పోయారన్నారు. తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి సియ్యారి దొన్నుదొర, శెట్టి బాబూరావు, నీరజ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని