logo

కూటమి విజయభేరి నేడే

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనకాపల్లి జిల్లాకు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోది తొలిసారిగా వస్తున్న నేపథ్యంలో సభను విజయవంతం చేయడానికి భాజపా, తెదేపా, జనసేన పార్టీల నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు.

Updated : 06 May 2024 06:32 IST

తాళ్లపాలెంలో మోదీ భారీ సభ
ముఖ్య అతిథిగా తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు, అనకాపల్లి, న్యూస్‌టుడే- అనకాపల్లి పట్టణం, కశింకోట: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనకాపల్లి జిల్లాకు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోది తొలిసారిగా వస్తున్న నేపథ్యంలో సభను విజయవంతం చేయడానికి భాజపా, తెదేపా, జనసేన పార్టీల నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. కశింకోట మండలం తాళ్లపాలెం సమీపంలోని జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న 80 ఎకరాల లేఅవుట్లో సభను నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు మోదీ ఇక్కడికి చేరుకుని ప్రజలను ఉద్దేశించి సభలో ప్రసంగిస్తారు. జిల్లాలో ఇప్పటికే తెదేపా, జనసేన అధినేతలు రెండు సార్లు పర్యటించారు. సోమవారం ప్రధానమంత్రి మోదీ పర్యటన నేపథ్యంలో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోంది. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి సుమారు 2 లక్షల మంది ఈ సభకు హాజరవుతారని భాజపా నేతలు అంచనా వేస్తున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు జోరుగా చేస్తున్నారు. ప్రధాని కోసం లేఅవుట్లోనే మూడు హెలీప్యాడ్‌లు సిద్ధం చేశారు. చంద్రబాబుకు మరో హెలిప్యాడ్‌ నిర్మించారు. సుమారు 3 వేల మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు. ఎస్‌పీజీ అధికారులు సభా ప్రాంగణ ఏర్పాట్లను పరిశీంచారు. ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ (ఐఎస్‌డబ్ల్యూ), బాంబు స్క్వాడ్‌, జాగిలాలతో హెలిప్యాడ్‌, సభావేదిక వద్ద తనిఖీలు చేపట్టారు.

సభావేదిక ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న కూటమి నేతలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని