logo

అభిమాన కెరటం

తెదేపా, జనసేన, భాజపా.. కూటమి అభ్యర్థుల నామినేషన్లకు.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మూడు పార్టీల శ్రేణులు.. ఏకతాటిపైకి వచ్చి తమ అభ్యర్థుల కోసం తరలివస్తున్నారు.

Published : 25 Apr 2024 05:55 IST

కూటమి శ్రేణుల్లో కదనోత్సాహం
ఈనాడు - అమరావతి, ఈనాడు డిజిటల్‌ -మచిలీపట్నం

తెదేపా, జనసేన, భాజపా.. కూటమి అభ్యర్థుల నామినేషన్లకు.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మూడు పార్టీల శ్రేణులు.. ఏకతాటిపైకి వచ్చి తమ అభ్యర్థుల కోసం తరలివస్తున్నారు. తాజాగా మచిలీపట్నం లోక్‌సభ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, తెదేపా అసెంబ్లీ అభ్యర్థి కొల్లు రవీంద్ర కూటమి శ్రేణులతో కలిసి.. ర్యాలీగా వెళ్లి.. బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతో మచిలీపట్నం నుంచి కృష్ణా జిల్లా సరిహద్దు ప్రాంతాల వరకూ.. పండగ వాతావరణం నెలకొంది. పసుపు జెండాలను రెపరెపలాడిస్తూ.. తెదేపా శ్రేణులు పోటెత్తాయి. తెలుపు జెండాలు.. ఎర్ర కండువాలతో జనసైన్యం ఉప్పెనలా కదిలింది. కాషాయ జెండాలతో భాజపా కార్యకర్తలు, నేతలు భారీగా తరలివచ్చారు. గన్నవరంలో తెదేపా అసెంబ్లీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అశేష అభిమానగణంతో కలిసి నామినేషన్‌ దాఖలు చేశారు. పామర్రులో వర్ల కుమార్‌ రాజా.. నామినేషన్ల ఘట్టం అశేష జనంతో అట్టహాసంగా జరిగింది. నామినేషన్లకు వచ్చే జనస్పందనను చూస్తే.. తమ విజయం ఎంత ఘనంగా ఉండబోతోందో అర్థమవుతోందంటూ.. కూటమి శ్రేణులు ఆనందంతో చెబుతున్నాయి.


రెండు జిల్లాల్లో ఒక్కటే మిగిలింది..

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి తరఫున బరిలో దిగిన అభ్యర్థుల్లో జగ్గయ్యపేటలో శ్రీరాం తాతయ్య మినహా మిగతా అందరూ నామినేషన్లు దాఖలు చేసేశారు. జగ్గయ్యపేటలో తెదేపా తరఫున శ్రీరాం తాతయ్య ఇప్పటికే మూడు సెట్ల డమ్మీ నామినేషన్లను వేశారు. నేడు భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్‌ వేయనున్నారు.]

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు