logo

రేపు పవన్‌ రాక!

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ నెల 7న గన్నవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు మద్దతుగా ఆయన రానున్నట్లు సమాచారం.

Published : 06 May 2024 04:24 IST

త్వరలో చంద్రబాబు కూడా?

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ నెల 7న గన్నవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు మద్దతుగా ఆయన రానున్నట్లు సమాచారం. ఈ క్రమంలో హనుమాన్‌జంక్షన్‌లో పవన్‌ కల్యాణ్‌ పర్యటన ఉంటుందని, స్థానికంగా ఉన్న ఎస్‌ఆర్‌ కల్యాణ మండపం సమీపంలోని బహిరంగ ప్రదేశంలో వారాహి వాహనంపై నుంచి జనసేనాని ప్రసంగించేలా సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం స్థల పరిశీలన, అనుమతులకు సంబంధించిన అంశాలపై స్పష్టత వస్తుందని, ఆ తర్వాత అధికారికంగా పర్యటన ఖరారు చేస్తామని తెదేపా-జనసేన నాయకులు చెబుతున్నారు. మరోపక్క ఈ నెల తొమ్మిదిన తెదేపా అధినేత చంద్రబాబు కూడా గన్నవరంలో ప్రచారం నిర్వహించేందుకు వీలుగా సన్నాహాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని