logo

ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే కేసులు

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు. నందిగామలో నిర్వహించిన ఎన్నికల సిబ్బంది శిక్షణలో ఆయన పాల్గొన్నారు. తరువాత విలేకరులతో మాట్లాడారు.

Published : 07 May 2024 05:25 IST

నందిగామ, న్యూస్‌టుడే: ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు. నందిగామలో నిర్వహించిన ఎన్నికల సిబ్బంది శిక్షణలో ఆయన పాల్గొన్నారు. తరువాత విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 934 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు 334 లోకేషన్లలో ఉన్నాయని, అందులో 236 పోలింగ్‌ కేంద్రాల్లో శాంతిభద్రతల సమస్య ఉన్నట్లు వివరించారు. ఆయా కేంద్రాల్లో సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌, వెబ్‌ కాస్టింగ్‌ ఉంటుందని చెప్పారు. వీడియోగ్రాఫర్లు, సూక్ష్మ పరిశీలకుల పర్యవేక్షణ ఉంటుందని వివరించారు. ఎక్కడైనా గొడవలకు దిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నందిగామలో కొందరు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా.. చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటివరకు 9600 పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లు పోలయ్యాయని తెలిపారు. ఈ నెల 7, 8 తేదీల్లో ఆర్వో స్థాయి అధికారుల పోస్టల్‌ బ్యాలట్‌ ఓటింగ్‌ ఉంటుందని చెప్పారు. జిల్లాలో 17 వేల నుంచి 18 వేల పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లు వస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 7, 9, తేదీల్లో 85 ఏళ్లు దాటిన, 40 శాతానికి పైగా అంగ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఇంటి వద్దనే ఓట్లు వేయిస్తామన్నారు. ఆర్వో రవీంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని