logo

రిమాండ్‌ ఖైదీ మృతదేహానికి పోస్టుమార్టం

అనుమానాస్పద స్థితిలో మంగళవారం మృతిచెందిన రిమాండ్‌ ఖైదీ భానుచందర్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. తొలుత

Published : 09 Dec 2021 04:05 IST

విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే: అనుమానాస్పద స్థితిలో మంగళవారం మృతిచెందిన రిమాండ్‌ ఖైదీ భానుచందర్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. తొలుత పోస్టుమార్టం నిర్వహణపై హైడ్రామా నడిచింది. అధికార పార్టీకి చెందిన నాయకులు కొందరు బుధవారం జీజీహెచ్‌కు వచ్చి ఇది ముమ్మాటికీ పోలీసులు చేసిన హత్యేనని ఆరోపించారు. పోస్టుమార్టం నిర్వహించేందుకు వీలు లేదని స్పష్టం చేశారు.  ఘటనపై మృతుని భార్య కల్యాణి మాట్లాడుతూ తన భర్తను పోలీసులు ర్యాష్‌ డ్రైవింగ్‌ అంటూ అరెస్టు చేశారని, షుగర్‌ ఉందని, అనారోగ్యంగా ఉందని తమకు ముందుగా చెప్పినా ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించేవాళ్లమని చెప్పారు. అసలేం జరిగిందో  పోలీసులు సరిగ్గా చెప్పడం లేదని, తనకు ఇద్దరు పిల్లలున్నారని,  వారి భవిష్యత్తుకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. అధికారులు.. కుటుంబసభ్యులకు నచ్చజెప్పి పోస్టుమార్టం అనంతరం మృతదేహం అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని