logo

వృద్ధుడిని కాపాడిన కానిస్టేబుల్‌

కాలువలో దూకిన వృద్ధుడిని కానిస్టేబుల్‌ కాపాడిన సంఘటన బుధవారం కుంచనపల్లి వద్ద చోటుచేసుకుంది. సీఐ శేషగిరిరావు తెలిపిన మేరకు.. విజయవాడలోని

Updated : 20 Jan 2022 03:16 IST

వృద్ధుడు వెంకటేశ్వర్లుతో కానిస్టేబుల్‌ సురేష్‌కుమార్‌

కుంచనపల్లి (తాడేపల్లి), న్యూస్‌టుడే: కాలువలో దూకిన వృద్ధుడిని కానిస్టేబుల్‌ కాపాడిన సంఘటన బుధవారం కుంచనపల్లి వద్ద చోటుచేసుకుంది. సీఐ శేషగిరిరావు తెలిపిన మేరకు.. విజయవాడలోని ప్రసాదంపాడుకు చెందిన 70 ఏళ్ల ఉసిరికాయల వెంకటేశ్వర్లు బుధవారం ఆత్మహత్య చేసుకోవడానికి కుంచనపల్లి జాతీయ రహదారి వంతెన పైనుంచి బకింగ్‌హాం కెనాల్‌లోకి దూకారు. అదే సమయంలో వంతెన కింద కెనాల్‌ రోడ్డులో విజయవాడకు చెందిన నేర పరిశోధన బృందం (క్లూస్‌ టీమ్‌) సీసీ ఫుటేజీలను పరిశీలిస్తుంది. అందులో వెంకేటశ్వర్లు కాల్వలోకి దూకడం కనిపించింది. వెంటనే స్పందించిన క్లూస్‌ టీంలోని కానిస్టేబుల్‌ సురేష్‌కుమార్‌ (పీసీనెం.2882) కెనాల్‌లోకి దూకి నీటిలో కొట్టుకుపోతున్న వృద్ధుడిని కాపాడి బయటకు తెచ్చారు. నీటిని తాగిన వెంకటేశ్వర్లుకు ప్రాథమిక చికిత్స అందించడంతో తెప్పరిల్లారు. అనంతరం ఆయనను తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ధైర్య సాహసాలు ప్రదర్శించి కెనాల్‌లో దూకి వెంకటేశ్వర్లును కాపాడిన కానిస్టేబుల్‌ సురేష్‌కుమార్‌ను సీఐ శేషగిరిరావు, ఎస్సై వినోద్‌కుమార్‌ అభినందించారు. తాను అనారోగ్య కారణాలతో చనిపోవాలని నిర్ణయించుకుని కెనాల్‌లో దూకినట్లు వృద్ధుడు పోలీసులకు వివరించారు. తదుపరి పోలీసులు బాధితుడి బందువుల వివరాలు తెలుసుకుని వారికి అప్పగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని