logo

నేనున్నాను.. నేను విన్నాను అన్నారే ఎక్కడున్నారయ్యా..!

నేనున్నాను.. నేను విన్నానంటూ రోజు చెబుతున్నారే.. ఎక్కడున్నారయ్యా మీరు అంటూ ఓ వృద్ధుడు అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని ప్రశ్నించారు. ‘మా సమస్య గురించి అధికారులకు చెబుతుంటే అక్కడికి వెళ్లు.. ఇక్కడికి వెళ్లు అంటున్నారు.. తిరిగి తిరిగి

Published : 25 May 2022 04:49 IST


సమస్యలపై ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని ప్రశ్నిస్తున్న షేక్‌ ఖలీల్‌అహ్మద్‌, దిల్షాద్‌ బేగమ్‌

 

అనంత నగరపాలక, న్యూస్‌టుడే: నేనున్నాను.. నేను విన్నానంటూ రోజు చెబుతున్నారే.. ఎక్కడున్నారయ్యా మీరు అంటూ ఓ వృద్ధుడు అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని ప్రశ్నించారు. ‘మా సమస్య గురించి అధికారులకు చెబుతుంటే అక్కడికి వెళ్లు.. ఇక్కడికి వెళ్లు అంటున్నారు.. తిరిగి తిరిగి విసిగిపోయాం. సమస్య మాత్రం తీర్చే నాథుడే లేరు’ అంటూ అనంతపురం నగరంలోని మంగళవారి కాలనీలో నివాసం ఉంటున్న షేక్‌ ఖలీల్‌ అహ్మద్‌, దిల్షాద్‌ బేగమ్‌ దంపతులు వాపోయారు. మంగళవారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు. ‘మాకు ఒక్క పథకం రాలేదు. నేను టైలరింగ్‌ చేస్తూ జీవనం సాగిస్తున్నా. కారు ఉందంటూ పథకాలు వర్తించలేదు. వాలంటీరుకు, సచివాలయ ఉద్యోగులకు చెప్పిన సంవత్సరం నుంచి పరిష్కారం కావడం లేదు. వృద్ధాప్య పింఛన్‌, ఇంటి పట్టా, చేయూత ఏ పథకం రావడం లేదు’ అని ఖలీల్‌ అహ్మద్‌ ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. నేను ఉన్నాను కాబట్టే వచ్చానని, మీ సమస్యను తీర్చి పథకాలు వర్తింపజేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొందరు అనుచరులు ఖలీల్‌ అహ్మద్‌ వద్దకు వచ్చి నగరపాలక స్థలంలో బంకు వేసుకొని మళ్లీ మమ్మల్నే ప్రశ్నిస్తావా అంటూ బెదిరించే ధోరణిలో మాట్లాడారు. ఓ అధికారి సైతం అనుచరులకే మద్దతు పలుకుతూ వెంటనే బంకు వెనక్కి జరుపుకో అంటూ వృద్ధుడిని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని