logo

ముగిసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ

సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. వారం రోజుల కోలాహలానికి తెర పడింది.

Published : 26 Apr 2024 02:08 IST

లోక్‌సభకు 30... అసెంబ్లీకి 285

అనంతపురం(శ్రీనివాస్‌నగర్‌), న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. వారం రోజుల కోలాహలానికి తెర పడింది. ఈనెల 18న మొదలైన నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. ఆఖరు రోజు అనంత లోక్‌సభ స్థానానికి 15 మంది అభ్యర్థులు 18 నామినేషన్లు, ఎనిమిది శాసనసభా స్థానాలకు 94 మంది అభ్యర్థులు 108 నామినేషన్లు దాఖలు చేశారు. వీటితో కలిపితే పార్లమెంటుకు 25 మంది అభ్యర్థులు 30 నామినేషన్లు వేయగా, అసెంబ్లీ స్థానాలకు 174 మంది 285 నామపత్రాలు దాఖలు పరిచారు. నియోజకవర్గాల వారిగా చూస్తే... రాయదుర్గానికి 17 మంది 29, ఉరవకొండకు 16 మంది 37, గుంతకల్లుకు 20 మంది 37, తాడిపత్రికి 27 మంది 42, శింగనమలకు 22 మంది 30, అనంత అర్బన్‌కు 29 మంది 43, కళ్యాణదుర్గానికి 17 మంది 24, రాప్తాడుకు 26 మంది అభ్యర్థులు 43 నామినేషన్లు వేశారు. అత్యధికంగా అనంత అర్బన్‌కు ఎక్కువ మంది నామినేషన్‌ వేశారు.శుక్రవారం నామపత్రాల పరిశీలన ఉంటుంది. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం నామినేషన్లు లేకపోతే తిరస్కరిస్తారు. ఈ నెల 27 నుంచి 29 దాకా ఉపసంహరణ ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని