logo

కృష్ణా జలాలతో చెరువులు నింపుతా

ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీలేదని, మంత్రి ఉష, ఎంపీ రంగయ్య రెండు వర్గాలుగా విడిపోయి నాశనం చేశారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు.

Published : 26 Apr 2024 02:34 IST

తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు

ర్యాలీలో విజయసంకేతం చూపుతున్న అమిలినేని సురేంద్రబాబు

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే : ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీలేదని, మంత్రి ఉష, ఎంపీ రంగయ్య రెండు వర్గాలుగా విడిపోయి నాశనం చేశారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. గురువారం ప్రజావేదిక నుంచి ప్రారంభమైన ర్యాలీ వాల్మీకి, మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌ కూడలి మీదుగా టీ కూడలి వరకు సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లు ఎలాంటి అభివృద్ధి చేయని గత పాలకులు ఇప్పుడు ఎలా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ఎంపీగా ఉన్న సమయంలో రంగయ్య నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. ప్రజలు అవకాశం ఇస్తే జీడిపల్లి నుంచి కృష్ణాజలాలు తీసుకొచ్చి 114 చెరువులను నీటితో నింపుతానని పేర్కొన్నారు. రహదారులు వేసి పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యేగా తనకు, ఎంపీగా అంబికా లక్ష్మీనారాయణను గెలిపించాలని కోరారు.

దుర్గం.. పసుపుమయం

నామినేషన్‌ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి తెదేపా కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో కళ్యాణదుర్గం పసుపుమయంగా మారింది. అభ్యర్థిని గజమాలతో సత్కరించారు. భారీ జనసందోహం మధ్య ర్యాలీ కొనసాగింది. నాయకులు, కార్యకర్తలు నృత్యాలతో సందడి చేశారు. 

తరలివచ్చిన తెదేపా శ్రేణులు, ప్రజలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు