logo

అరాచక శక్తులకు అండగా నిలుస్తారా?

అసమర్థులు, అరచాక శక్తులకు అండగా నిలుస్తారా? అభివృద్ధి చేసేవారికి అండగా నిలుస్తారా? అంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌  ప్రజలను ప్రశ్నించారు. 

Published : 26 Apr 2024 02:10 IST

వజ్రకరూరు: చాబాలగ్రామంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌

వజ్రకరూరు, న్యూస్‌టుడే:  అసమర్థులు, అరచాక శక్తులకు అండగా నిలుస్తారా? అభివృద్ధి చేసేవారికి అండగా నిలుస్తారా? అంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌  ప్రజలను ప్రశ్నించారు.  మండలంలోని ధర్మపురి, చాబాల, ఛాయపురం, పోట్టిపాడు, కమలపాడు, గూళ్యపాళ్యం గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు గజమాలలు, హారతులతో కేశవ్‌కు స్వాగతం పలికారు. పొట్టిపాడులో అనంతపురం జిల్లా తెదేపా జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు మాదవ్‌  కేశవ్‌ను మార్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం కేశవ్‌ మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన నిధులతో వైకాపా ప్రభుత్వం సోకులు పడుతుందన్నారు. నియోజకవర్గంలోని వైకాపా నాయకుడు విశ్వేశ్వరరెడ్డికు తాను తీయించిన పిల్లకాలువలకు నీరివ్వలేని అసమర్థ నాయకుడని విమర్శించారు. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పిల్లకాలువలకు నీరందిస్తామన్నారు.. వైకాపా ప్రభుత్వంలో గ్రామాల్లో కనీసం మురుగునీటి కాలువలను కూడా  విశ్వేశ్వర రెడ్డి  నిర్మించలేకపోయారని ఎద్దేవా చేశారు. తాగునీటి  ఎద్దడి నెలకొందని ఐదేళ్ల కాలంలో జానేడు పైపులైను కూడా వేయకుండా పల్లెలను దాహంతో గొంతెండేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా మండల అధ్యక్షుడు వేంకటేశ్‌, నాయకులు నాగేంద్ర, దస్తగిరి, మాజీ సర్పంచి ఎర్రిస్వామి, కార్యకర్తలు పాల్గొన్నారు.

కూడేరు:  ప్రచారం చేస్తున్న పయ్యావుల విక్రమ సింహ

కూడేరు (ఉరవకొండ): రాష్ట్రంలో తెదేపా అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల సంక్షేమంతో పాటు అభివృద్ధి సాధ్యం అవుతుందని ఆ పార్టీ యువ నాయకుడు పయ్యావుల విక్రమసింహ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఆయన కూడేరు మండలం ఇప్పేరులో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. తెదేపా మండల నాయకులు పాల్గొన్నారు.

రాయదుర్గం: ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న తెదేపా అభ్యర్థి కాలవ శ్రీనివాసులు

రాయదుర్గం: పట్టణంలోని 23వ వార్డులో గురువారం సాయంత్రం తెదేపా అభ్యర్థి కాలవ శ్రీనివాసులు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించి, సూపర్‌సిక్స్‌ పథకాలపై అవగాహన కల్పించారు. రానున్న ఎన్నికల్లో తెదేపాను గెలిపించాలని కోరారు. 23వ వార్డు ఇన్‌ఛార్జి గుర్రమ్మ, తెదేపా నాయకులు మురళి, అజయ్‌కుమార్‌రెడి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని