logo

రౌడీయిజం చేస్తే ఊరుకోం

ధర్మవరంలో రౌడీయిజం చేస్తే ఊరుకోబోమని మాజీ ఎమ్మెల్యే, భాజపా నాయకుడు గోనుగుంట్ల సూర్యనారాయణ పేర్కొన్నారు. బుధవారం ధర్మవరంలో నిర్వహించిన సమావేశంలో భాజపా నాయకులతో కలసి మాట్లాడారు. ప్రెస్‌క్లబ్‌లో భాజపా నాయకులు

Published : 30 Jun 2022 02:43 IST

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ

ధర్మవరం, న్యూస్‌టుడే: ధర్మవరంలో రౌడీయిజం చేస్తే ఊరుకోబోమని మాజీ ఎమ్మెల్యే, భాజపా నాయకుడు గోనుగుంట్ల సూర్యనారాయణ పేర్కొన్నారు. బుధవారం ధర్మవరంలో నిర్వహించిన సమావేశంలో భాజపా నాయకులతో కలసి మాట్లాడారు. ప్రెస్‌క్లబ్‌లో భాజపా నాయకులు, కార్యకర్తలపై దాడి వెనుక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రమేయం ఉందని ఆరోపించారు. ఎమ్మెల్యేపై 307 సెక్షన్‌ కింద కేసు నమోదు చేయాలని డిమాండు చేశారు. లేనిపక్షంలో డీఎస్పీ, సీఐపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. తమ కార్యకర్తలపై దాడిచేసి పారిపోవడం కాదని, చేతనైతే తనతోనే తేల్చుకోవాలని, ఎక్కడికి రావాలో చెప్పాలని సవాల్‌ విసిరారు.

ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం

తమ పార్టీ నాయకులపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసిన ఘటనలో చర్యలు తీసుకోవడానికి స్థానిక పోలీసులు వెనకడుగు వేస్తున్నారని గోనుగుంట్ల సూర్యనారాయణ పేర్కొన్నారు. ఎస్సీ నాయకుడిపై దాడి జరిగినా అట్రాసిటీ కేసు నమోదు చేయలేదన్నారు. ఈ విషయాన్ని ఎస్సీ కమిషన్‌, మానవ హక్కుల కమిషన్‌ దృష్టికి తీసుకెళతామన్నారు.

దాడి హేయమైన చర్య: ధర్మవరం ప్రెస్‌క్లబ్‌లో భాజపా శ్రేణులపై వైకాపా దాడి చేయడం హేయమైన చర్య అని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి అన్నారు. ఆయన తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు అందరికీ ఉంటుందని, ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కేందుకు అధికార పార్టీ ప్రయత్నించడం సరికాదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని