logo

వెజ్‌ తిరంగా.. నోరూరా తినంగా

జిల్లాలోని హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిలో దాబాలు, రెస్టారెంట్‌లకు కొదవలేదు. గుత్తి బైపాస్‌ రోడ్డుకు కూతవేటు దూరంలో దసమేశ్‌ పంజాబీ దాబాలో వెజ్‌ తిరంగా పేరుతో తయారు చేసే వంటకం ప్రత్యేకమైనది. జాతీయజెండా రంగులతో ప్రత్యేకంగా తయారు చేసే ఈ వంటకం ఈ రహదారిలో తరచూ ప్రయాణించే వాళ్లకు పరిచయమే. మిక్స్‌డ్‌

Published : 15 Aug 2022 05:22 IST

జాతీయజెండా రంగులతో తయారుచేసిన ప్రత్యేక వంటకం

జిల్లాలోని హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిలో దాబాలు, రెస్టారెంట్‌లకు కొదవలేదు. గుత్తి బైపాస్‌ రోడ్డుకు కూతవేటు దూరంలో దసమేశ్‌ పంజాబీ దాబాలో వెజ్‌ తిరంగా పేరుతో తయారు చేసే వంటకం ప్రత్యేకమైనది. జాతీయజెండా రంగులతో ప్రత్యేకంగా తయారు చేసే ఈ వంటకం ఈ రహదారిలో తరచూ ప్రయాణించే వాళ్లకు పరిచయమే. మిక్స్‌డ్‌ వెజిటేబుల్‌ కూర కాషాయం రంగు, ప్రత్యేకమైన క్రీమ్‌, జీడిపప్పుతో చేసిన కూర తెల్లరంగులో, పాలకూరతో చేసిన కూర ఆకుపచ్చ రంగులో చేసి మూడింటిని ఒక ప్లేట్లో పెట్టి కస్టమర్లకు అందిస్తారు. ఈ దాబాలో వెజ్‌ తిరంగా ఒకసారి తిన్నవారు మళ్లీ వచ్చినప్పుడు తప్పకుండా ఆరగిస్తారని దాబా యజమానులు తెలిపారు. రూ.250కు అందిస్తున్నారు.  

- ఈనాడు, అనంతపురం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని