logo

జయ.. జయహే.. జగన్మాత

లోకమాత.. వెన్నుచూపని ధైర్యమివ్వు.. అపజయాలను అధిగమించే శక్తినివ్వు.. సవ్యంగా నడిచే దారిని చూపు.. పాలకులను కదిలించు..

Published : 05 Oct 2022 01:56 IST

పాతూరులో వాసవీమాత నిజరూపదర్శన అలంకరణ

లోకమాత.. వెన్నుచూపని ధైర్యమివ్వు.. అపజయాలను అధిగమించే శక్తినివ్వు.. సవ్యంగా నడిచే దారిని చూపు.. పాలకులను కదిలించు.. అధికారులను నడిపించు.. ప్రజల కష్టాలను కడతేర్చి.. విజయాలు అందించు..
జిల్లాలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం అమ్మవారి ఆలయాల్లో మహర్నవమి వేడుకలు నిర్వహించారు. లోక కంటకుడైన మహిషాసురుడిని సంహరించిన లోకమాత ఉగ్రరూపంలో దర్శనమిచ్చారు. జయ జయహే జగన్మాత అంటూ భక్తులు వేనోళ్ల కీర్తించారు. పలు ఆలయాల్లో చండీయాగం చేశారు. బుధవారం విజయదశమి పురస్కరించుకుని అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు.

- న్యూస్‌టుడే, అనంత సాంస్కృతికం

శివకోటిలో శివకామేశ్వరి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని