logo

వైద్య విద్యార్థినికి అపూర్వ స్వాగతం

మారుమూల గ్రామంలో మొట్టమొదటిసారిగా వైద్యవిద్య అభ్యసిస్తోన్న విద్యార్థినికి గ్రామస్థులు గ్రామపొలిమేర నుంచి ఆమెకు ఆహ్వానం పలుకుతూ ఇంటివరకు పూలు చల్లుకుంటూ తీసుకెళ్లారు.

Updated : 05 Oct 2022 05:14 IST

ప్రియాంకకు స్వాగతం పలుకుతున్న స్థానికులు

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: మారుమూల గ్రామంలో మొట్టమొదటిసారిగా వైద్యవిద్య అభ్యసిస్తోన్న విద్యార్థినికి గ్రామస్థులు గ్రామపొలిమేర నుంచి ఆమెకు ఆహ్వానం పలుకుతూ ఇంటివరకు పూలు చల్లుకుంటూ తీసుకెళ్లారు. కదిరి మండలం చౌటతండాకు చెందిన చోక్లానాయక్‌, రెడ్డిరాణిల కుమార్తె ప్రియాంక తిరుపతి పద్మావతి వైద్యకళాశాలలో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందారు. చిగురుమానుతండా, నల్లగుట్టతండా, చౌటతండాలలో మొట్టమొదటిసారిగా వైద్యవిద్యలో సీటుసాధించిన విద్యార్థిని గ్రామానికి వస్తున్న విషయం తెలుసుకుని గ్రామస్థులందరూ ఆమెను అభినందనలతో ముంచెత్తారు. ఎంబీబీఎస్‌లో చేరిన తరువాత సోమవారం రాత్రి ఆమె గ్రామానికి వచ్చారు. ప్రియాంక రాకతో తండాలో పండగ వాతావరణం నెలకొంది. కేకుకోసి పంచుకున్నారు. తన పట్ల ప్రేమాభిమానం చూపిన తండావాసులకు, హార్ట్‌ టు హెల్ప్‌ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు రవినాయక్‌, సభ్యులకు ప్రియాంక కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని