logo

33 శాఖల ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం

త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు ఉపయోగించుకోడానికి 33 శాఖల పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిందని డీఆర్వో రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

Published : 29 Mar 2024 04:22 IST

మాట్లాడుతున్న డీఆర్‌ఓ రామకృష్ణారెడ్డి, పక్కన డీపీఓ ప్రభాకర్‌రావు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు ఉపయోగించుకోడానికి 33 శాఖల పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిందని డీఆర్వో రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయ కాన్ఫరెన్స్‌ హాలులో డీపీఓ, పోస్టల్‌ బ్యాలెట్‌ నోడల్‌ అధికారి ప్రభాకర్‌రావుతో కలిసి ఆ 33 శాఖల జిల్లా అధికారులతో డీఆర్‌ఓ సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల రోజు అత్యవసర విధుల్లో ఉండే ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఉంటుందని ఆయన చెప్పారు. నిర్దేశిత శాఖల అధికారులు తగిన ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఈ విషయాన్ని సంబంధిత ఉద్యోగులకు అవగాహన కల్పించాలని సూచించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం కల్పించిన శాఖల్లో.. మెట్రో, రైల్వే రవాణా, పోలింగ్‌ రోజున వార్తలు కవర్‌ చేసే జర్నలిస్టులు, విద్యుత్తు, బీఎస్‌ఎన్‌ఎల్‌, పోస్టల్‌-టెలిగ్రామ్‌, దూరదర్శన్‌, రేడియో, పాల సేకరణ, ఉత్పత్తి, ఆరోగ్యం, ఆహారం, విమానయానం, రోడ్డు రవాణా, అగ్నిమాపక, ట్రాఫిక్‌ పోలీస్‌, అంబులెన్స్‌, షిప్పింగ్‌, ఫైర్‌ఫోర్స్‌, జైలు, ఎక్సైజ్‌, నీటి అథారిటీ, ఖజానా, అటవీ, సమాచార-ప్రజా సంబంధాలు, పోలీసు, పౌర రక్షణ, హోంగార్డులు, ఆహార పౌర సరఫరాలు, శక్తి, ఎయిర్‌పోర్టు, పీఐబీ, పీడబ్ల్యూడీ, జాతీయ సమాచారం, విపత్తు.. వంటి శాఖల ఉద్యోగులు పోలింగ్‌ రోజున విధుల్లో ఉంటే పోస్టల్‌ బ్యాలెట్‌ వేయడానికి వీలుందని ఆయన వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని