logo

ఉక్కపోతకు ఉపశమనం

ఉమ్మడి జిల్లాలో మంగళవారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో ప్రజలకు కాస్తా ఉపశమనం కలిగింది. పలు మండలాల్లో సాయంత్రం నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

Published : 08 May 2024 05:47 IST

ఉరుములు, మెరుపులతో వర్షం

అనంతపురం నగరంలో జలమయమైన సప్తగిరి సర్కిల్‌

అనంతపురం(వ్యవసాయం), న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో మంగళవారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో ప్రజలకు కాస్తా ఉపశమనం కలిగింది. పలు మండలాల్లో సాయంత్రం నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉమ్మడి జిల్లాలో అనంతపురం, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ, హిందూపురం వ్యవసాయ సబ్‌ డివిజన్లలోని పలు మండలాల్లో వర్షం కురిసింది. గత ఏడాది ఖరీఫ్‌ నుంచి వర్షం పడలేదు. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయి. ఉదయం 10 గంటలకే బయటకు రాని పరిస్థితి. జనమంతా ఉక్కిరిబిక్కిరయ్యారు. ఉద్యాన పండ్ల తోటలు ఎండుముఖం పట్టాయి. వరుణుడు చల్లటి కబురు అందించడంతో జనమంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 5 గంటలపాటు విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. అనంత నగరంలో రహదారులు, మురుగు కాలువన్నీ జలమయమయ్యాయి. విద్యుత్తు సరఫరా ఆగిపోవడంతో నగర ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని