logo

స్టార్‌ లైనర్‌ బస్సుల ప్రారంభం

చిత్తూరు ఆర్టీసీ బస్టాండులో గురువారం కొత్తగా అందుబాటులోకి వచ్చిన రెండు స్టార్‌ లైనర్‌ స్లీపర్‌ కోచ్‌ బస్సులను ఆర్టీసీ రాష్ట్ర వైస్‌ ఛైర్మన్‌ విజయానందరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

Published : 27 Jan 2023 02:35 IST

జెండా ఊపి బస్సులను ప్రారంభిస్తున్న ఆర్టీసీ రాష్ట్ర వైస్‌ ఛైర్మన్‌ విజయానందరెడ్డి

చిత్తూరు(ఆర్టీసీ), న్యూస్‌టుడే: చిత్తూరు ఆర్టీసీ బస్టాండులో గురువారం కొత్తగా అందుబాటులోకి వచ్చిన రెండు స్టార్‌ లైనర్‌ స్లీపర్‌ కోచ్‌ బస్సులను ఆర్టీసీ రాష్ట్ర వైస్‌ ఛైర్మన్‌ విజయానందరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల సౌకర్యార్థం కోసం కొత్త బస్సులను ప్రారంభించినట్లు చెప్పారు. చిత్తూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వారు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఆర్టీసీలో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో డిప్యుటీ మేయర్‌ రాజేష్‌కుమార్‌రెడ్డి, డిప్యుటీ చీఫ్‌ మెకానికల్‌ ఇంజినీరు ఇబ్రహీం, చిత్తూరు ఆర్టీసీ రెండో డిపో మేనేజర్‌ రూపశ్రీ, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని