logo

మట్టిని అక్రమంగా తరలిస్తే క్రిమినల్‌ కేసులు

చెరువులో మట్టిని అక్రమంగా తరలిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని తహసీల్దారు పద్మావతి హెచ్చరించారు. పట్టణంలోని చెవిరెడ్డిపల్లి చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్నట్లు కలెక్టర్‌కు ఫిర్యాదు వెళ్లడంతో సోమవారం తనిఖీలు చేపట్టారు

Published : 21 Mar 2023 02:59 IST

వెంకటగిరి: చెరువులో మట్టిని అక్రమంగా తరలిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని తహసీల్దారు పద్మావతి హెచ్చరించారు. పట్టణంలోని చెవిరెడ్డిపల్లి చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్నట్లు కలెక్టర్‌కు ఫిర్యాదు వెళ్లడంతో సోమవారం తనిఖీలు చేపట్టారు. జలవనరుల, పంచాయతీ, పురపాలక అధికారుల సమన్వయంతో మట్టి తరలింపును అడ్డుకుంటామన్నారు. మరోవైపు సర్వే నంబరు 91-4లో కాలువ పోరంబోకు భూమిని ఆక్రమించుకున్నారని స్థానికులు తహసీల్దారు దృష్టికి తీసుకువచ్చారు. పరిశీలించాక బోర్డు ఏర్పాటు చేయాలని సర్వేయర్‌కు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని