logo

నలుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్‌

సార్వత్రిక పాఠశాల పదో తరగతి, ఇంటర్మీడియేట్‌ పరీక్షల్లో విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన నలుగురు ఉపాధ్యాయులను విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ డీఈవో దేవరాజు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 28 Mar 2024 03:23 IST

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: సార్వత్రిక పాఠశాల పదో తరగతి, ఇంటర్మీడియేట్‌ పరీక్షల్లో విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన నలుగురు ఉపాధ్యాయులను విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ డీఈవో దేవరాజు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు కృష్ణవేణి జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో సిట్టింగ్‌ స్క్వాడ్‌గా నియమితులైన గాండ్లపల్లె పురపాలకోన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయిని కుసుమకుమారి, గుడిపాల మండలం బొమ్మసముద్రం ప్రభుత్వ ఉన్నత పాఠశాల పీఈటీ శ్రీనివాసులు విధులకు హాజరు కాకపోవడంతో సస్పెండ్‌ అయ్యారు. సార్వత్రిక పాఠశాల పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా నియమితులైన స్థానిక బాలాజీ కాలనీ పురపాలక పాఠశాల ఉపాధ్యాయుడు సుధీర్‌, గుడుపల్లె మండలం ఒంటిపల్లె ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు సుధాకర్‌(సెకండరీ గ్రేడ్‌ టీచర్లు) సక్రమంగా విధులు నిర్వర్తించనందున సస్పెండ్‌ చేస్తూ ఆయన ఉత్తర్వులు ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని