logo

‘రోజా మాయమాటలు నమ్మి మోసపోవద్దు’

మంత్రి రోజా మాయమాటలు నమ్మి మోసపోవద్దని శ్రీశైలం ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్‌ రెడ్డివారి చక్రపాణిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని జంబాడ సమీప నెహ్రునగర్‌లో లక్ష్మీపతిరాజు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

Published : 06 May 2024 04:41 IST

జంబాడలో ఆత్మీయ సమావేశంలో గాలి భానుప్రకాష్‌కు శాలువా కప్పుతున్న శ్రీశైలం ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్‌ రెడ్డివారి చక్రపాణిరెడ్డి

విజయపురం, న్యూస్‌టుడే: మంత్రి రోజా మాయమాటలు నమ్మి మోసపోవద్దని శ్రీశైలం ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్‌ రెడ్డివారి చక్రపాణిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని జంబాడ సమీప నెహ్రునగర్‌లో లక్ష్మీపతిరాజు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ పదేళ్లపాటు పార్టీ ఆభివృద్ధి కోసం కృషి చేసిన తనకు తగిన గుణపాఠం నేర్పారన్నారు. ఆమె స్వార్థం కోసం మొదటి నుంచి పార్టీ జెండా మోసిన వారిని పక్కన పెట్టారని విమర్శించారు. నిండ్రలో నేను, వడమాలపేటలో మురళీధర్‌రెడ్డి, పుత్తూరులో అమ్ములు, విజయపురంలో లక్ష్మీపతిరాజు, నగరిలో కేజేకుమార్‌ పార్టీ కోసం సొంత డబ్బులు ఖర్చు చేసి పార్టీ బలోపేతం చేశామన్నారు. ఆమె అక్రమ సంపాదన కోసం వ్యాపారాలకు అడ్డుపడతామని భావించి పార్టీ నుంచి దూరం చేసుకుంటు వచ్చారని,  అందువల్లే పార్టీ మారాల్సి వచ్చిందన్నారు. ఎన్నికల్లో ఆమె కల్లిబొల్లి మాటలు విని ఎవరు మోసపోవద్దని మళ్లీ గెలిపించుకుంటే ఐదేళ్లు కనబడరని తెలిపారు. గాలి భానుప్రకాష్‌ మాట్లాడుతూ పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉందని మీరందరూ కలసికట్టుగా కృషి చేసి అత్యధిక మెజారీతో గెలపించాలని కోరారు. రోజాను తరిమికొట్టే సమయం ఆసన్నమైందని విజయపురం ప్రకృతి సంపదను దోచుకున్న ఆమెను చిత్తుచిత్తుగా ఓడించి ఇంటికి పంపాలని కోరారు. పలువురు వైకాపా అనుచరులు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని