logo

విస్తరిస్తోందా..?

కరోనా వైరస్‌ తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. జిల్లాలో వారం రోజులుగా నమోదవుతున్న కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య అందుకు నిదర్శనం. గడిచిన 24 గంటల్లో 233 పాజిటివ్‌ కేసుల నమోదవగా ఆ సంఖ్య 2,97,070కి చేరింది. ఇప్పటి వరకు 1,290 మంది

Published : 17 Jan 2022 05:07 IST

మసీదు సెంటర్‌ (కాకినాడ), న్యూస్‌టుడే: కరోనా వైరస్‌ తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. జిల్లాలో వారం రోజులుగా నమోదవుతున్న కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య అందుకు నిదర్శనం. గడిచిన 24 గంటల్లో 233 పాజిటివ్‌ కేసుల నమోదవగా ఆ సంఖ్య 2,97,070కి చేరింది. ఇప్పటి వరకు 1,290 మంది మృతి చెందగా ప్రస్తుతం 1,928 క్రియాశీలక కేసులున్నాయి. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి  పెద్ద ఎత్తున గ్రామాలకు తరలి రావడం, కొవిడ్‌ పరీక్షల సంఖ్య పెరగడం వల్ల పాజిటివిటీ రేటు పెరగుతోందని వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రోజుకు అయిదు వేల మందికి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. మరోవైపు కొవిడ్‌ నిబంధనల అమలుకు సంబంధించి చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండడంతో నిర్లిప్తత పెరిగింది. దీంతో చాలామంది మాస్కులు ధరించకుండా ఇష్టానుసారం తిరుగుతుండడం, భౌతిక దూరం మర్చిపోయి.. ఎక్కడికక్కడ గుంపులుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తికి అవకాశం కలుగుతోంది. సామూహిక వేడుకలు, కోడి పందేలు, తిరునాళ్లలో కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవడం వల్ల సమస్య పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. 
పరీక్షలు చేయించుకోవాలి..
దగ్గు, జ్వరం ఇతర లక్షణాలుంటే తప్పనిసరిగా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలి. జిల్లాలో ఇప్పటి వరకు 9 ఒమిక్రాన్‌ కేసులు నమోదవగా ఆరుగురు కోలుకున్నారు. 
- డా. గౌరీశ్వరరావు, డీఎంహెచ్‌వో 

  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని