logo

ముగిసిన సాంస్కృతిక సంబరాలు

రాజమహేంద్రవరం ఆనం కళాకేంద్రంలో మూడు రోజులపాటు నిర్వహించిన జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు గురువారంతో ముగిశాయి.

Published : 02 Dec 2022 05:16 IST

జానపద కళాకారుల ప్రదర్శన

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం ఆనం కళాకేంద్రంలో మూడు రోజులపాటు నిర్వహించిన జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు గురువారంతో ముగిశాయి. మూడ్రోజులుగా ఏడు విభాగాల్లో జరిగిన జºనల్‌స్థాయి సాంస్కృతిక పోటీల్లో మొత్తం 1,466 కళాకారులు పాల్గొని తమ కళాప్రతిభను ప్రదర్శించారు. ఏకపాత్రధారి(సోలో) ప్రదర్శనల్లో 583 మంది, బృంద పోటీల్లో 883 మంది కళాకారులు పాల్గొని కళాప్రదర్శనలు ఇచ్చారు. చివరి రోజున కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్రనాట్యం, కర్ణాటక గాత్ర, ఫోక్‌ బృందం, ఫోక్‌ సాంగ్స్‌, జానపద నృత్య ప్రదర్శన విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో 263 మంది కళాకారులు పాల్గొని తమదైన ప్రదర్శనలు ఇచ్చినట్లు భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు ఆర్‌.మల్లికార్జునరావు తెలిపారు. పోటీల్లో పాల్గొన్న కళాబృందాలకు జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారులు సి.హెచ్‌.శ్రీనివాస్‌, ఐ.కాశయ్య, సంగీత కళాశాల ప్రిన్సిపల్‌ ఎం.కృష్ణమోహన్‌  చేతుల మీదుగా ధ్రువపత్రాలు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని