logo

ఎయిడ్స్‌ రహిత సమాజ స్థాపనే లక్ష్యం

ఎయిడ్స్‌ రహిత సమాజ స్థాపనే లక్ష్యంగా ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ కె.మాధవీలత పేర్కొన్నారు. ఎయిడ్స్‌ నివారణ దినాన్ని పురస్కరించుకుని  గురువారం రాజమహేంద్రవరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

Published : 02 Dec 2022 05:16 IST

ర్యాలీ ప్రారంభిస్తున్న కలెక్టర్‌ మాధవీలత, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి ప్రత్యూషకుమారి తదితరులు

రాజమహేంద్రవరం వైద్యం: ఎయిడ్స్‌ రహిత సమాజ స్థాపనే లక్ష్యంగా ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ కె.మాధవీలత పేర్కొన్నారు. ఎయిడ్స్‌ నివారణ దినాన్ని పురస్కరించుకుని  గురువారం రాజమహేంద్రవరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.ప్రత్యూషకుమారి, డీఎంహెచ్‌వో వెంకటేశ్వరరావు, జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణాధికారిణి వసుంధర, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌  రమేష్‌ తదితరులతో కలిసి ర్యాలీ ప్రారంభించారు. అంబేడ్కర్‌ భవన్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.  హెచ్‌ఐవీ, టీబీ రోగులకు పౌష్టికాహార కిట్లను అందజేశారు. ఎంహెచ్‌వో వినూత్న, వైద్యాధికారిణి కోమల, సీడీపీవో సీహెచ్‌వీ నరసమ్మ, మూడోపట్టణ సీఐ మధుబాబు తదితరులు పాల్గొన్నారు.


272 గ్రామాల్లో సర్వే

వి.ఎల్‌.పురం (రాజమహేంద్రవరం): శాశ్వత భూహక్కు-భూరక్ష పథకంలో భాగంగా ప్రస్తుతం 272 రెవెన్యూ గ్రామాల్లో డ్రోన్‌ల ద్వారా భూ రీసర్వే ప్రక్రియ జరుగుతోందని కలెక్టర్‌ మాధవీలత తెలిపారు. విజయవాడ సీసీఎల్‌ఏ కార్యాలయం నుంచి భూ రీసర్వేపై సీసీఎల్‌ఏ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ గురువారం దూరదృశ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో వైఎస్సార్‌ పథకంలో భాగంగా ఎంపిక చేసిన 44 గ్రామాల్లో 13వ నోటిఫికేషన్‌ విడుదల చేశామన్నారు. సమగ్ర రీసర్వే పూర్తయిన వెంటనే భూముల ఇన్‌వర్డ్‌, గ్రామ సచివాలయం రిజిస్ట్రేషన్‌, సర్వే పూర్తిచేసిన తర్వాత భూయజమానికి క్యూఆర్‌ ఆధారిత స్మార్ట్‌ టైటిల్‌ కార్డులు అందజేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని