logo

తొలిరోజు నామినేషన్ల సందడి

ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో తొలిరోజే ఆ సందడి కనిపించింది. దశమి గురువారం కావడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్రులు కూడా నామపత్రం సమర్పించారు.

Updated : 19 Apr 2024 06:51 IST

న్యూస్‌టుడే బృందం: ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో తొలిరోజే ఆ సందడి కనిపించింది. దశమి గురువారం కావడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్రులు కూడా నామపత్రం సమర్పించారు. ప్రధాన పార్టీల నుంచి తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఒకరు నామినేషన్లు దాఖలు చేయగా కాకినాడ జిల్లా నుంచి ప్రధాన పార్టీల నుంచి ఒక్కరు కూడా నామినేషన్‌ వేయలేదు.

నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందిస్తున్న ఆదిరెడ్డి శ్రీనివాస్‌, చిత్రంలో భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి

  • అభ్యర్థి పేరు: ఆదిరెడ్డి శ్రీనివాస్‌
  • పార్టీ: తెదేపా
  • విద్యార్హత: బీఈ
  • కేసులు: మొత్తం ఎనిమిది కేసులు నమోదయ్యాయి.
  • చరాస్తి విలువ: రూ.8.69 కోట్లు
  • స్థిరాస్తి విలువ: రూ.36.92 కోట్లు
  • అప్పులు: రూ.13.17 కోట్లు

నియోజకవర్గం: గోపాలపురం

  • అభ్యర్థి : మద్దిపాటి వెంకటరాజు,
  • పార్టీ : తెదేపా (ఎన్డీయే కూటమి అభ్యర్థి)
  • విద్యార్హతలు : ఎంఎస్‌సీ (కంప్యూటర్స్‌)
  • కేసులు : తాడేపల్లిగూడెం, గోపాలపురం, దేవరపల్లి, పోలీసు స్టేషన్‌ల పరిధిలో ప్రధానంగా కేసులు ప్రస్తావించారు.
  • చరాస్తుల విలువ మొత్తం: భార్యాభర్తల ఆదాయం రూ.55,22,638, వార్షిక ఆదాయం రూ.22,45,595(2022-23)
  • బంగారం : 50 గ్రాముల బంగారం (సుమారు రూ.3,20,000 విలువ చేసే బంగారం)
  • స్థిరాస్తి విలువ : రూ.49,10,000
  • అప్పులు : పలు బ్యాంకుల్లో, ఆర్థిక రుణ సంస్థల్లో అప్పులు రూ.56,63,484

నియోజకవర్గం: నిడదవోలు

  • అభ్యర్థి: జి.శ్రీనివాస్‌ నాయుడు
  • పార్టీ: వైకాపా
  • విద్యార్హత: బీఈ, ఎంబీఏ
  • క్రిమినల్‌ కేసులు: లేవు
  • చరాస్తుల విలువ: జి.శ్రీనివాస్‌నాయుడుకు రూ.62,37,606 విలువైన 828 గ్రాముల బంగారం,
  • 5 కేజీల వెండి ఉన్నాయి. భార్య సుమలత పేరున రూ.1,35,44,830 విలువైన 2,150 గ్రాముల బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయి. భార్య పేరు మీద 3 కార్లు ఉన్నాయి.
  • స్థిరాస్తుల విలువ: చల్లా చింతలపూడిలో ఆయనకు 27.86 ఎకరాలు, భార్యకు 19.445 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.
  • రుణాలు: బాండ్లు, డిబెంచర్లు ఆయనకు రూ.4,51,01,415, అతని భార్యకు 7,16,80,500 ఉన్నాయి.
  • ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు: ఇద్దరి చేతి నగదు కలిపి రూ.12,38,812. రూ.12,29,772 (శ్రీనివాస్‌నాయుడు), రూ.3,30,078 (సుమలత). వివిధ పాలసీలు ఆయనకు 2,80,57,303, భార్యకు రూ.13,00,000లు ఉన్నాయి.

నియోజకవర్గం: కొవ్వూరు

  • అభ్యర్థి : తలారి వెంకట్రావు
  • పార్టీ : వైకాపా
  • విద్యార్హత: ఈసీఈడీ (ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ డిప్లమో)
  • క్రిమినల్‌ కేసులు : లేవు
  • చరాస్తుల విలువ: రెండు కార్లు, 120 గ్రాముల బంగారం (రూ.8 లక్షలు), భార్య పేరున 640 గ్రాములు (రూ.42 లక్షలు)
  • ఇద్దరు పిల్లలకు చెరొక 80 గ్రాముల బంగారం
  • స్థిరాస్తులు: 2.46 ఎకరాలు, 83 చదరపు గజాలు, 420 చదరపు అడుగుల స్థలం, 65,340 చదరపు అడుగులు, రుణాలు: రూ.4.94 లక్షలు
  • ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు: రూ.2.95 లక్షలు, సేవింగ్స్‌ : రూ.63,075, జాయింట్‌ ఖాతాలో రూ.3.75 లక్షలు
  • ఎన్నికల ఖాతా : రూ.5 లక్షలు
  • భార్య పరంజ్యోతి సేవింగ్స్‌ ఖాతాలో : రూ.63 లక్షలు

నియోజకవర్గం: రామచంద్రపురం

  • అభ్యర్థి: పిల్లి సూర్యప్రకాష్‌
  • పార్టీ: వైకాపా
  • విద్యార్హతలు: బి.ఇ
  • కేసులు: క్రిమినల్‌ కేసులేమీ లేవు
  • చరాస్తుల విలువ మొత్తం:
  • రూ.42,66,302లు డిపాజిట్లు
  • భార్య: పిల్లి దివ్యశ్రీ పేరున: రూ.33,92,237 డిపాజిట్లు,
  • స్థిరాస్తి విలువ: హైదరాబాద్‌లో ప్లాట్‌, ఇళ్ల స్థలాలు, భార్య పేరున మాదాపూర్‌లో ప్లాట్‌, కృష్ణా జిల్లా బాపులపాడు, మొత్తం సుమారుగా రూ.2.13కోట్లు విలువ
  • అప్పులు: రూ.25,51,077లు

తనయుడికి డమ్మీ అభ్యర్థిగా బోస్‌

రామచంద్రపురం నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగా నామపత్రాలు దాఖలు చేసిన పిల్లి సూర్యప్రకాష్‌కు డమ్మీ అభ్యర్థిగా తండ్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ నామపత్రాలను దాఖలు చేశారు. ఇతనికి చరాస్తుల విలువ మొత్తం: రూ.23,32,208, కియా కారు, స్థిరాస్తి విలువ: హసనబాదలో గృహం రూ.30లక్షలు, అప్పులు: కియా కారు రుణం ఇంకా రూ.5,13,255లు ఉన్నట్లు చూపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని