logo

జగన్‌ దళితులను దగా చేశారు: గోరంట్ల

అధికార పార్టీ దళితులను అన్ని విధాలుగా మోసం చేసిందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి విమర్శించారు.

Published : 01 May 2024 05:03 IST

సంఘీభావం తెలుపుతున్న బుచ్చయ్యచౌదరి

టి.నగర్‌, న్యూస్‌టుడే: అధికార పార్టీ దళితులను అన్ని విధాలుగా మోసం చేసిందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి విమర్శించారు. మంగళవారం రాజమహేంద్రవరంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌ అయిదేళ్ల అధికారంలో దళితులకు చెందిన 27 పథకాలను రద్దు చేశారన్నారు.  ఉపప్రణాళిక నిధులను దారిమళ్లించి వారి భవిష్యత్తుకు అడ్డు తగిలారన్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు పొందే అవకాశం లేకుండా చేశారన్నారు. స్టడీసర్కిళ్లను నిర్వీర్యం చేశారన్నారు. దళితుడిని చంపిన వ్యక్తికి ఎమ్మెల్సీగా పదవి అప్పగించారన్నారు. సీతానగరంలో ఇసుక దోపిడీని అడ్డుకొంటే శిరోముండనం చేయించారన్నారు. అమ్మఒడి పథకానికి 16 లక్షల మంది అర్హులు ఉంటే దాన్ని 8 లక్షలకు కుదించడం జరిగిందన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక అనేకమంది యువత ఇబ్బంది పడుతున్నారన్నారు. తాజాగా జగన్‌ ప్రకటించిన మ్యానిఫెస్టో ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. మద్యనిషేధం అమలు చేస్తానని చెప్పి మద్యం అమ్మకాలు పెంచేశారన్నారు.  కాపు ఉద్యమాన్ని ముద్రగడ అణచి వేశారని, కాపులకు అన్యాయం చేసిన జగన్‌కు ఎలా మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఎమ్మార్పీఎస్‌ ఉత్తరకోస్తా జిల్లాల అధ్యక్షుడు ముమ్మిడివరపు చినసుబ్బారావు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ  ఆదేశానుసారం కూటమికి మద్దతు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని