logo

మండపేటలో వారాహి విజయభేరి సభ నేడు

జనసేనాని పవన్‌కల్యాణ్‌ బుధవారం మండపేటలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు అక్కడ వారాహి విజయభేరి బహిరంగ సభకు హాజరవుతారని నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి వేగుళ్ల లీలాకృష్ణ, కూటమి ఉమ్మడి అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు తెలిపారు.

Published : 01 May 2024 04:54 IST

మండపేట, న్యూస్‌టుడే: జనసేనాని పవన్‌కల్యాణ్‌ బుధవారం మండపేటలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు అక్కడ వారాహి విజయభేరి బహిరంగ సభకు హాజరవుతారని నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి వేగుళ్ల లీలాకృష్ణ, కూటమి ఉమ్మడి అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు తెలిపారు. స్థానిక బైపాస్‌ రోడ్డులో గతంలో ‘రా కదలిరా’ సభకు చంద్రబాబు విచ్చేసిన సందర్భంగా ఏర్పాటుచేసిన హెలీప్యాడ్‌ను పవన్‌ పర్యటనకు వినియోగించనున్నారు. బుధవారం ఉదయం అక్కడకు చేరుకుని బైపాస్‌ రోడ్డు నుంచి ఏడిద రోడ్డు మీదుగా టౌన్‌హాలు సమీపంలో ఏర్పాటు చేసే సభా వేదిక వద్దకు వస్తారు. అక్కడ వారాహి పైనుంచి ప్రసంగించనున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని