logo

గండాల దారులను గాలికొదిలేశారు!

నిత్యం వందల వాహనాలు తిరిగే ఉమ్మడి జిల్లా ప్రధాన దారులివి. గుంతలతో ప్రయాణికులకు గండాలుగా మారాయి.

Published : 01 May 2024 05:30 IST

రహదారుల అభివృద్ధి పట్టని ప్రభుత్వం
నిత్య ప్రమాదాలతో ప్రజల మృత్యువాత

నిత్యం వందల వాహనాలు తిరిగే ఉమ్మడి జిల్లా ప్రధాన దారులివి. గుంతలతో ప్రయాణికులకు గండాలుగా మారాయి. ప్రాణాలు పోతున్నా పాలకులు పట్టించుకోరు. కొన్నింటికి సకాలంలో నిధులివ్వరు.. మరికొన్నింటికి నిధులున్నా పనులు పూర్తిచేయరు. దీంతో  ఈ మార్గాల్లో ప్రయాణమంటేనే వాహన  చోదకులు హడలిపోతున్నారు.  దారులు బాగుపడాలంటే  ఇంకెందరి ప్రాణాలు పోవాలని ఆప్తులను కోల్పోయిన బాధితుల కుటుంబాల వేదన   పాలకుల చెవికెక్కడం లేదు.

 బిల్లు అందక  యాతన

యర్నగూడెం త్యాజంపూడి రహదారి

కోటపాడు పెదరాయవరం మధ్య అధ్వాన్నంగా ఏడీబీ రోడ్డు

అయిదేళ్లలో 400 ప్రమాదాలు

మొత్తం కిలోమీటర్లు: 4.5
రహదారి దుస్థితి: భారీ గుంతలు పడి, రాళ్లు తేలి అధ్వానంగా దర్శనమిస్తోంది.
గుంతలు:  సుమారు 65 పెద్ద, 285 చిన్న గుంతలు ఉన్నాయి.  
ఏం చేయాలి: రెండు వరుసల రోడ్డు నిర్మించాలి.
ప్రతిపాదనలు: మరమ్మతులకు
రూ.27 లక్షలు మంజూ రయ్యాయని ర..భ. శాఖ
అధికారులు చెబుతున్నారు. నాలుగుసార్లు
టెండర్లకు పిలిచినా ఎవరూ రాలేదు.

 న్యూస్‌టుడే, దేవరపల్లి


రాజమహేంద్రవరం సీతానగరం రహదారి

18 కి.మీ.ల్లో పది మందిబల్ఠి

మొత్తం కిలోమీటర్లు: 18.2  కి.మీ ఇప్పటికీ ప్రయాణం నిత్య యాతనే.
ప్రమాదకర గుంతలు: 28. ఈ అయిదేళ్లలో 35 ప్రమాదాలు  చోటు చేసుకుని పదిమంది ప్రాణాలు కోల్పోయారు.
నత్తనడకే: రూ.70 కోట్లుతో విస్తరణ పనులు చేపట్టి నాలుగేళ్లు అయింది. ఇప్పటీకి పూర్తికాలేదు. నిర్మాణంపై పలుమార్లు ఎమ్మెల్యే  రాజాను ప్రజలు ప్రశ్నించారు. ఆరేసి నెలలు వాయిదా వేసుకుంటూ వచ్చారు.

 న్యూస్‌టుడే, సీతానగరం


అంబాజీపేట గన్నవరం (ఎ-జి రోడ్డు)

నవంబరు దాకా ఆగాల్సిం దేనా!

ప్రాధాన్యం: పి.సి.యు.(ప్యాసింజర్‌ కార్‌ యూనిట్‌) లెక్కప్రకారం ద్విచక్ర వాహనాలు మొదలుకుని భారీ వాహనాలు వరకు రోజూ ఈ మార్గంలో ఆరువేల రాకపోకలు సాగిస్తుంటాయి.  

మొత్తం కిలోమీటర్లు : 8
ప్రమాదకర పరిస్థితి: పోతవరం వద్ద 320 మీటర్ల మేర రహదారి కుంగిపోయి అత్యంత ప్రమాదకరంగా మారింది.  
గుంతలు: చిన్నాపెద్దా కలిపి సుమారు వెయ్యి
నిధులున్నా అభివృద్ధి చేయక: సి.ఆర్‌.ఎఫ్‌.(సెంట్రల్‌రోడ్‌ఫండ్‌) టెండరు గత ఏడాది డిసెంబరులో ఖరారైంది. ఈ రోడ్డుకు సుమారు రూ.8 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది మార్చి 4న ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు శంకుస్థాపన చేసినా ఇంతవరకు పనులు మొదలు పెట్టలేదు.

నవంబరు వరకు నాన్చుడే: రిటైనింగ్‌ వాల్‌ నిర్మించిన తరువాత అంటే వర్షాకాలం వెళ్లిన తరువాత రహదారి అభివృద్ధి పనులు చేస్తారని సంబంధిత అధికారులు వెల్లడిస్తున్నారు. అంటే నవంబరు వరకు తారురోడ్డు పనులు జరిగే పరిస్థితి కానరావటంలేదు. అంతవరకు ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పవు.

 న్యూస్‌టుడే, పి.గన్నవరం


సామర్లకోట బిక్కవోలు రోడ్డు

బిల్లు అందక యాతన

మొత్తం కిలోమీటర్లు:  పది
ప్రమాదకర పరిస్థితి: హుస్సేన్‌పురం నుంచి మండలం శివారు పెదబ్రహ్మదేవం వరకు రోడ్డు పొడవునా పెద్ద పెద్ద గుంతలతో ప్రమాదకరంగా ఉంది. చిన్నా పెద్దా కలిపి సుమారు 500 వరకు గుంతులున్నాయి.
ప్రమాదాల తీవ్రత: గతంలో జరిగిన ప్రమాదాల్లో వాహనాలు అదుపుతప్పి ముగ్గురు మృతి చెందారు.
బిల్లులు చెల్లించక: రహదారి నిర్మాణానికి గతేడాదిలో రూ.5 కోట్లు మంజూరయ్యాయి. గుత్తేదారుకు బిల్లులు మంజూరుకాక మాధవపట్నం వద్ద పనులు ఆపేశారు.

 న్యూస్‌టుడే, సామర్లకోట గ్రామీణం


రాజానగరం పెద్దాపురం ఏడీబీ రోడ్డు (కాకినాడ వరకు)

రాష్ట్ర ప్రభుత్వ నిధులు విడుదల చేయక..

రహదారి పొడవు: 60 కిలోమీటర్లు.
నిర్మాణ అంచనా వ్యయం: రూ.300కోట్లు
ప్రమాదకర గుంతలు: 145
ఇదీ తీవ్రత: ఈ అయిదేళ్లలో 300కు పైనే ప్రమాదాలు జరిగి 24 మంది ప్రాణాలు కోల్పోయారు.
కారణం: ఏడీబీ నిధులు విడుదల చేసినా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోగా.. బ్యాంకు సమకూర్చినవి ఇతర ప్రభుత్వ పథకాలకు మళ్లించినట్టు ప్రచారం
జరుగుతోంది. గుత్తేదారుకి రూ.50కోట్లుపైనే రావాల్సి ఉంది.

 న్యూస్‌టుడే, రంగంపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని