logo

పేరు మార్పునకు ముద్రగడ సిద్ధంగా ఉండాలి

త్వరలో జరగనున్న పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌     కల్యాణ్‌ గెలవనున్నారని పేరు మార్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని ముద్రగడను ఉద్దేశించి జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి(బాబు) అన్నారు.

Published : 01 May 2024 04:45 IST

సమావేశంలో మాట్లాడుతున్న జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామిబాబు

జగ్గంపేట, జగ్గంపేట గ్రామీణం: త్వరలో జరగనున్న పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌     కల్యాణ్‌ గెలవనున్నారని పేరు మార్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని ముద్రగడను ఉద్దేశించి జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి(బాబు) అన్నారు. జగ్గంపేట ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం తుమ్మలపల్లి రమేష్‌ ఆధ్వర్యంలో ఆయన మాట్లాడారు. పిఠాపురంలో పవన్‌కల్యాణ్‌ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని ముద్రగడ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటివరకు చాలామంది మతాలు మార్చుకోవడం చూశామని కులాలు మార్చుకోవడం ఎలాగో ఆయనే చెప్పాలన్నారు. కులాలను కలపడం, కుల, మత బేధం లేకుండా ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడం జనసేన సిద్ధాంతమన్నారు. ముద్రగడకు వయస్సుతోపాటు చాదస్తం పెరుగుతోందన్నారు.  

జనసేన పార్టీ నుంచి సూర్యచంద్ర తొలగింపు

జనసేన పార్టీ నుంచి పాటంశెట్టి సూర్యచంద్రను అధ్యక్షులు పవన్‌కళ్యాణ్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు  రామస్వామి పేర్కొన్నారు. జనసేన పార్టీ సిద్దాంతాలు, అధినాయకుని నిర్ణయాలను గౌరవించేవారే నిజమైన కార్యకర్తలుగా ఉంటారన్నారు. పార్టీకి ద్రోహం చేసిన సూర్యచంద్ర జనసేన గుర్తును కోరుకోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. సూర్యచంద్రకు నిజాయతీ ఉంటే, ప్రజల్లో సానుభూతి ఉందంటే గాజుగ్లాసు గుర్తును వదిలేసి ఎన్నికలకు వెళ్లాలన్నారు. జగ్గంపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి తుమ్మలపల్లి రమేష్‌ మాట్లాడుతూ.. గాజుగ్లాసు గుర్తు జనసేనకు సంబంధించిన గుర్తు అని రాష్ట్ర ప్రజలకి తెలుసన్నారు. సూర్యచంద్ర లాంటి వ్యక్తులకు జనసేన పార్టీ సిద్దాంతాలు నచ్చనపుడు గుర్తును తీసుకోవడంలో అర్ధం లేదు. ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి వరుపుల తమ్మయ్యబాబు, జిల్లా కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్‌, సంయుక్త కార్యదర్శి సూరంపాలెం బాలు, మరిసే రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని