logo

బరి.. గెలుపే గురి

ఉమ్మడి జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పార్లమెంట్‌ స్థానాల పరిధిలో పరిశీలిస్తే.. కాకినాడ, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమలకు 15 మంది చొప్పున అభ్యర్థులు బరిలో నిలిచారు.

Published : 01 May 2024 04:54 IST

 మూడు ఎంపీ స్థానాలకు 42 మంది పోటీ
 21 అసెంబ్లీ నియోజకవర్గాలకు 270 మంది సై

 ఈనాడు, రాజమహేంద్రవరం: ఉమ్మడి జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పార్లమెంట్‌ స్థానాల పరిధిలో పరిశీలిస్తే.. కాకినాడ, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమలకు 15 మంది చొప్పున అభ్యర్థులు బరిలో నిలిచారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 12 మంది మిగిలారు.

  •  అసెంబ్లీ స్థానాలకు అత్యధికంగా కాకినాడ జిల్లాలో పోటీపడుతున్నారు. ఇక్కడ అభ్యర్థుల సంఖ్య సెంచరీ దాటేసింది. మొత్తం ఏడు నియోజకవర్గాల పరిధిలో 108 మంది పోటీపడుతున్నారు. అత్యధికంగా కాకినాడ నగరం, గ్రామీణం, ప్రత్తిపాడు నియోజకవర్గాల నుంచి 15 మంది చొప్పున పోటీలో ఉన్నారు. అత్యల్పంగా పెద్దాపురం నుంచి 10 మంది ఉన్నారు.
  •  బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు సంబంధించి 91 మంది పోటీకి సై అంటున్నారు. ముమ్మిడివరం నుంచి అత్యధికంగా 15 మంది, రాజోలు నుంచి అతి తక్కువగా పది మంది పోటీపడుతున్నారు.
  •  తూర్పుగోదావరి జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో 71 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో రాజానగరం, నిడదవోలు నుంచి అత్యధికంగా 12 మంది, రాజమహేంద్రవరం గ్రామీణం నుంచి అత్యల్పంగా ఏడుగురు బరిలో నిలిచారు.`

     

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని