logo

స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం కల్పించాలి

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత కీలకమని, ప్రతిఒక్క ఓటరు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ హక్కును వినియోగించుకునే వాతావరణ కల్పించేలా చూడాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థపై ఉందని రాష్ట్ర ఎన్నికల పోలీసు పరిశీలకుడు దీపక్‌మిశ్రా అన్నారు.

Published : 30 Apr 2024 06:33 IST

సూచనలిస్తున్న ఎన్నికల పోలీసు పరిశీలకుడు దీపక్‌మిశ్రా

రాజమహేంద్రవరం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత కీలకమని, ప్రతిఒక్క ఓటరు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ హక్కును వినియోగించుకునే వాతావరణ కల్పించేలా చూడాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థపై ఉందని రాష్ట్ర ఎన్నికల పోలీసు పరిశీలకుడు దీపక్‌మిశ్రా అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత, ఎస్పీ జగదీష్‌, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల వేళ పోలీసులు, భద్రత సిబ్బంది నిర్వర్తించే విధి నిర్వహణ ఎంతో కీలకమన్నారు. కులం, మతం, ప్రాంతం తారతమ్యం లేకుండా ప్రవర్తించాల్సి ఉంటుందన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటరు స్లిప్పుల పంపిణీ, పోస్టల్‌ బ్యాలెట్‌, హోం ఓంటింగ్‌ ప్రక్రియ గురించి వివరించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు 405 ఉన్నట్లు గుర్తించి శాంతిభద్రతల పరంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో అదనపు డీజీపీ శంఖత్రప బాగ్బి, జేసీ తేజ్‌భరత్‌, జిల్లా ఎన్నికల పోలీసు పరిశీలకుడు అరవింద్‌, వ్యయ పరిశీలకుడు రోహిత్‌నగర్‌, జైఅరవింద్‌, నితిన్‌కురియన్‌, అదనపు ఎస్పీ అనిల్‌కుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని