logo

ప్రజాస్వామ్యాన్ని రక్షించే బాధ్యత ప్రజలదే: యనమల

ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే బాధ్యత ప్రజలదేనని, ఓటు హక్కు వినియోగంతోనే అది  సాధ్యమని తెదేపా పోలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. గోపాలపురంలో శుక్రవారం కూటమి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో బీసీ సామాజిక నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు.

Published : 04 May 2024 05:00 IST

మద్దిపాటిని పరిచయం చేస్తున్న తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల

గోపాలపురం: ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే బాధ్యత ప్రజలదేనని, ఓటు హక్కు వినియోగంతోనే అది  సాధ్యమని తెదేపా పోలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. గోపాలపురంలో శుక్రవారం కూటమి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో బీసీ సామాజిక నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. అయిదేళ్ల వైకాపా పాలనలో ఆర్థిక పరమైన న్యాయం కేవలం ఆ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యే, పార్టీ నాయకులకే జరిగిందన్నారు. నా.. నా.. అంటూనే ఎస్సీ, బీసీ, ఎస్టీ, మెనార్టీలను సీఎం జగన్‌ తీవ్రంగా మోసగించారని ఆరోపించారు.  కూటమి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజును గెలిపించాలని కోరారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తెదేపా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల వారు బాగుండాలంటే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నారు. అభ్యర్థి వెంకటరాజు మాట్లాడుతూ ఓటు విలువ అందరికీ ఒక్కటేనని, రాష్ట్ర, ప్రజల బాగుకు పనిచేసే వ్యక్తులకే ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇన్‌ఛార్జి దొడ్డిగర్ల సువర్ణరాజు, తెదేపా, జనసేన, భాజపా మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని